TGSRCT | తెలంగాణలో కొత్తగా 422 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈమేరకు తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ప్రయాణం అందిస్తుండడంతో బస్సులు నిత్యం కిటకిటలాడుతున్నాయి. సీట్లు దొరకక ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. బస్సుల కోసం బస్టాండ్లు, బస్టాపుల జనం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఆర్టీసీ తెలిపింది.
మరోవైపు కాలంచెల్లిన 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్ లు , 17 ఎక్స్ప్రెస్ లు, 22 డీలక్స్ బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నారు. 13 నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ పక్కనపెట్టనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.