అంత్యక్రియల సమయంలో బయటపడ్డ నిజం
Warangal MGM Hospital | రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో (MGM Hospital ) చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువులు, స్నేహితులు అంతా సదరు వ్యక్తి మృతదేహం చుట్టూ చేరి కన్నీరుమున్నీరయ్యారు. ఈక్రమంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక చివరిసారిగా మృతుని ముఖం చూడాలన బంధువులు భావించారు. శవానికి చుట్టిన వస్త్రాన్ని తొలగించి చూడగా అందరూ అవాక్కయ్యారు. ఆ శవం తమ వ్యక్తికి కాదని గుర్తించడంతో అక్కడ కలకలం రేపింది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తొర్రూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అతడిని ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు చికిత్స పొందిన కుమారస్వామి శుక్రవారం ఉదయం మృతిచెందాడు. దీంతో ఎంజీఎం మార్చురీ (Mortuary) లో పోస్టుమర్టం నిర్వహించి డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. శవాన్ని తీసుకుని ఇంటికి వెళ్లిన వారు దహన సంస్కారాలు నిర్వహంచే సమయంలో అది కుమారస్వామిది కాదని గుర్తించారు. దీంతో హుటాహుటినా మళ్లీ ఎంజీఎంకు చేరుకుని మార్చురీ సిబ్బందిపై ఫైర్ వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.