- అటవీ శాఖలో ఉద్యోగం పేరుతో మోసం
- అడ్వాన్స్ లక్ష.. విధుల్లో చేరాక మరో లక్ష అంటూ నిరుద్యోగిని మోసం చేసిన మహిళ
- ఉద్యోగం కల్పించలేదు..? డబ్బులు తిరిగి చెల్లించరు..?
Job Scam in Hanmakonda | రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం.. ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలన్న తపన.. ఓ ఆఫీసులో ఉద్యోగాలు పెట్టిస్తున్నారన్న వార్త తన చెవిలో పడింది. గంపెడాశలతో ఆ ఆఫీసుకు వెళ్లిన సదరు వ్యక్తికి వాళ్ళు చెప్పిన కహానీ ఆశలు రేకెత్తించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం అందులోనూ అటవీ శాఖ (Forest Department) లో ఇంకేముంది ఇంటికెళ్లి తల్లిదండ్రులను ఒప్పించాడు వాళ్ళు అడిగిన అడ్వాన్స్ డబ్బులు ఎలాగోలా సమర్పించుకున్నాడు. నెల రోజుల్లో ఉద్యోగంలో చేరవచ్చు, ఉద్యోగం కోసం తల్లిదండ్రులు వడ్డీకి తెచ్చిన అప్పు కట్టచ్చని భావించిన సదరు నిరుద్యోగికి నెల రోజులకే ఊహించని షాక్ తగిలింది. డబ్బులు చెల్లించి నాలుగు నెలలు గడిచింది.. ఇంకా ఉద్యోగం రావట్లేదని అనుమానంతో ఆ ప్రైవేట్ కార్యాలయానికి వెళ్లి గట్టిగా నిలదీస్తే మీ డబ్బులు మీకు చెల్లిస్తామని సదరు మహిళా చెప్పడంతో కంగుతిన్న నిరుద్యోగి ఏంచేయాలో తెలియక కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఆ మహిళ యొక్క ఆఫీసు కు వెళ్ళి డబ్బులు ఇవ్వాలని అడగగా రేపుమాపు అంటూ కాలయాపన చేయడంతోపాటు దబాయిస్తున్నట్లు బాధిత తండ్రి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Job Scam | ఉద్యోగం కల్పించరు.. డబ్బులు చెల్లించరు?
వరంగల్(Warangal) జిల్లా గీసుగొండ (Geesukonda) గ్రామానికి చెందిన ఎండీ యాకుబ్ పాషా కొడుకు కు అటవీ శాఖ లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం (Outsourcing Job) కల్పిస్తామని దానికి గాను మొత్తం 2 లక్షలు అని ముందుగా లక్ష ఉద్యోగంలో జాయిన్ అయినంక మరో లక్ష రూపాయలు చెల్లించాలని హన్మకొండ నగరంలోని “ఎమ్ ఎన్ కే” సర్వీసెస్ మేనేజర్ అయిన ఓ మహిళ చెప్పినట్లు భాదితులు పేర్కొన్నారు. ఆమె మాటలు నమ్మిన బాధితుడు ఫిబ్రవరి 1 వ తేదీన లక్ష రూపాయలను ఎమ్మెన్కే సర్వీసెస్ కార్యాలయంలో ఆ మహిళకు నగదు రూపంలో అందజేశారని సమాచారం. ఒప్పందం ప్రకారం నాలుగు నెలలు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో తిరిగి డబ్బులు చెల్లించాలని అడిగితే రేపు.. మాపు అని కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఉద్యోగం రాక ఇటు అప్పు తీసుకొచ్చి కట్టిన డబ్బులు రాక నిరుద్యోగితోపాటు ఆయన తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురైతున్నారు.సదరు మహిళ పై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసేందుకు భాదితులు సిద్ధమైనట్లు సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.