- బాధిత కుటుంబం ఇంటికెళ్లి వివరాలు సేకరించిన అధికారులు
- సర్కార్ లైవ్ కథనం ఆధారంగా విచారణ చేపట్టిన అటవీశాఖ ?
- డబ్బుల లావాదేవీలపై విచారణ ప్రారంభం
- బాధితుడిని నమ్మించి డబ్బులు తీసుకున్న మహిళపై విమర్శల వెల్లువ
- పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన బాధిత కుటుంబం
Sarkar Live Impact on Job Scam: రెండు లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు అనే కథనం ఓరుగల్లులో ప్రకంపనలు సృష్టించింది.హన్మకొండ లోని “ఎం ఎన్ కే” సర్వీసెస్ లో మేనేజర్ గా ఉన్న మహిళ ఓ నిరుద్యోగి నుండి అటవిశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టిస్తామని రెండు లక్షల రూపాయలు మాట్లాడుకుని, లక్ష రూపాయలను అడ్వాన్స్ గా తీసుకొని అటు ఉద్యోగం పెట్టించక ,ఇటు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో భాదితుడు “సర్కార్ లైవ్” ను ఆశ్రయించగా “రెండు లక్షలు కొట్టు ఉద్యోగం పట్టు” అనే శీర్షికన మంగళవారం కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. అయితే “సర్కార్ లైవ్” ప్రచురించి కథనానికి స్పందించిన అటవీశాఖ అధికారులు గురువారం బాధితుడు అయినటువంటి ఎండి యాకుబ్ పాషా ఇంటికెళ్లి వివరాలు సేకరించినట్లు సమాచారం.
సదరు మహిళ ఏవిధంగా నమ్మించింది, డబ్బులు ఎలా ఇచ్చారు, డబ్బులు తీసుకున్నట్లు ఏమైనా రశీదు ఉన్నాయా ,ఎన్ని నెలల క్రితం సదరు మహిళ కు డబ్బులు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు అనే కోణంలో విచారణ జరిపారని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా సర్కార్ లైవ్ వెలువరించిన కథనంతో సదరు మహిళ లో టెన్షన్ మొదలై భాదితులతో చర్చలు జరపడానికి మధ్యవర్తిని పెట్టి బాధితుడి తండ్రి ని కొన్నిరోజులు ఆగాలని బ్రతిమిలాడుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టిస్తామని నిరుద్యోగిని నమ్మించి డబ్బులు దండుకున్న “ఎంఎన్ కే”సర్వీసెస్ పై అలాగే అందులో మేనేజర్ ను అని చెప్పి డబ్బులు తీసుకున్న మహిళపై పోలీస్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు తిరిగి డబ్బులు ఇప్పించాలని బాధితుడి తండ్రి కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    