- 48 గంటల్లో 4 ఫుడ్ పాయిజన్ ఘటనలు..
- కాంగ్రెస్ పాలనపై హరీశ్ రావు ఆగ్రహం
గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (MLA Harish Rao) ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్, నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్.. ఇలా 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనాలు అని హరీష్ రావు విమర్శించారు.
48 గంటల్లో 4 ఘటనలు:
- సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం నాగల్‌గిద్ద మోడల్ పాఠశాల
- నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాల
- జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామం గురుకుల పాఠశాల
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గురుకుల కళాశాల
రోజురోజుకీ దిగజారుతున్న గురుకులాల దీనస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. వరుసగా ఫుడ్ పాయిజన్లతో విద్యార్థులు దవాఖానల పాలవుతుంటే వాళ్ల మనస్సు కరగడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ అభివృద్ధి చేసిన గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండడం సరికాదని అన్నారు. సంకుచిత మనస్తత్వంతో దళిత, గిరిజన, బడుగు, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాల ఖ్యాతికి గ్రహణం పట్టిస్తుండటం దుర్మార్గమని విమర్శించారు. స్వయంగా తానే మానిటరింగ్ చేస్తానని గొప్పలకు పోయిన రేవంత్ రెడ్డి, మీ మానిటరింగ్ ఏమైంది? విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.