Sarkar Live

TGSRTC | నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో సంబరాలు..

Hyderabad : టీజీ ఆర్టీసీ (TGSRTC )లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi sheme ) విజయవంతంగా అమలవుతుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)

TGSRTC

Hyderabad : టీజీ ఆర్టీసీ (TGSRTC )లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi sheme ) విజయవంతంగా అమలవుతుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు రూ.6700 కోట్ల విలువైన ప్రయాణాలు చేశారని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల  రియంబర్స్మెంట్ చెల్లించిందని చెప్పారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మహాలక్ష్మి పథకం విజయవంతంలో భాగస్వాములైన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు,అధికారులు, ఇతర సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.

TGSRTC సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి

ఆర్టీసీ (TS RTC)లో 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపోలు, 341 బస్ స్టేషన్ నేడు జరిగే కార్యక్రమాలు బస్ స్టేషన్లు, డిపోలలో బ్యానర్ల ప్రదర్శన చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ సూచించారు. అన్ని డిపోల్లో ముఖ్యమైన బస్ స్టేషన్లలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సంబరాల కార్యక్రమాల్లో స్థానిక ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, వీఐపీలను సమావేశానికి ఆహ్వానించాలని, మహిళా ప్రయాణీకుల ప్రసంగాలను ఏర్పాటు చేయడం, కూరగాయల విక్రేతలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వ్యాపార మహిళలు, హాస్పిటళ్లకు మెరుగైన చికిత్స కోసం వెళ్లే మహిళలు, యాత్రికులు వంటి వివిధ వర్గాలకు చెందిన వారు తమ ప్రసంగాలలో తమ ప్రయాణ అనుభవాలను పంచుకోవాలని మంత్రి పొన్నం కోరారు.  డిపోలు, ముఖ్యమైన బస్ స్టేషన్లలో మహిళా ప్రయాణికులను శాలువాలు, బహుమతులతో సత్కరించనున్నారు. మహా లక్ష్మి ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసర చన, రంగోలి, చిత్రలేఖనం నిర్వహించాలని, విజేతలకు బహుమతులు అందజేయాలని చెప్పారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?