Vande Bharat Express | తెలంగాణ, ఏపీలో వందేభారత్ రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సేవలందిస్తున్న వందేభారత్ రైళ్లలో దాదాపు అన్నీ ఫుల్ ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. దీంతో.. కీలకమైన మార్గాల్లో వందేభారత్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు ఉండడంతో ఆయా మార్గాల్లో వందేభారత్ ట్రైన్స్‌ను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రయాణీకులు సుదీర్ఘ కాలం వేచి చూస్తున్న విధంగా మరో ప్రధాన మార్గం లో కొత్తగా వందేభారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను నడిపించనున్నారు.
కొత్తగా ఈ మార్గంలోనే..
కొత్తగా పూణే నగరం నుంచి నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. వీటిని బెలగావి, షెగోన్, వడోదర, సికింద్రాబాద్ కు కేటాయించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ – నాగపూర్ మధ్య ప్రస్తుతం వందేభారత్ నడుస్తోంది. పూణేకు ఉన్న డిమాండ్ కు అనుగుణంగా కొత్త రైలును సికింద్రాబాద్ నుంచి పుణె వరకు ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పుణెకు కేవలం శతాబ్ది ఎక్స్ ప్రెస్ మాత్రమే నడుస్తోంది. ఇది మధ్యాహ్నం నుంచి బయలుదేరుతుంది. అలా కాకుండా వందేభారత్ నుంచి ఉదయమే ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Vande Bharat Express : సికింద్రాబాద్ నుంచి పూణే
సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ సరైన ఆదరణ లభించడంలేదు.. ఈ రైలును మొదట 20 భోగీలతో ప్రారంభించారు. అయితే ప్రయాణికుల సంఖ్య తగినంతగా లేకపోడంతో ఎనిమిది బోగీలకు కుదించి నడపుతున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి నాగపూర్ కు నాలుగు రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి పుణెకు వందేభారత్ సిట్టింగ్ కాకుండా స్లీపర్ సర్వీస్ ను రాత్రివేళ ప్రారంభిస్తే బాగుంటుందని తొలుత అధికారులు భావించారు. కాగా.. హైదరాబాద్, పుణె.. రెండు నగరాలు ఐటీ నగరాలు కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఆక్యుపెన్సీ బాగుంటుందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.