Sarkar Live

ULLU, ALTT వంటి 25 OTT యాప్స్​పై నిషేధం – జాబితా ఇదీ.

OTT Ban India 2025, ULLU Banned, ALTT OTT Ban, Desiflix Ban, Obscene Content OTT, MIB Notification OTT, OTT List Banned 2025
OTT

దేశంలోని ప్రసిద్ధ OTT యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. తమ ఓటీటీ ప్లాట్​ఫామ్​లలో అశ్లీల కంటెంట్ అందిస్తున్నాయన్న ఆరోపణలతో ALTT, ULLU, Desiflix, BigShots సహా 25 యాప్‌లను నిషేధిస్తూ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ యాప్‌లు ఐటీ చట్టం 2000 (సెక్షన్ 67, 67A), ఇండియన్ జస్టిస్ కోడ్ 2023 (సెక్షన్ 294), మహిళల అసభ్య ప్రాతినిధ్యం నిషేధ చట్టం 1986 (సెక్షన్ 4) తదితర చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలున్నాయి. స్టోరీబోర్డ్ 18 నివేదిక ప్రకారం, ఈ యాప్‌లు అశ్లీల వీడియోలు, బోల్డ్ ప్రకటనలు, అభ్యంతరకరమైన కంటెంట్‌ను బహిరంగంగా చాలా కాలంగా ప్రసారం చేస్తున్నాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వీటికి యాక్సెస్‌ను నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ముఖ్యంగా పిల్లలు ఈ కంటెంట్‌కి ఆకర్షితులవుతున్నారని, దీనివల్ల సమాజంపై ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముందని తెలిపింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఈ యాప్‌లు పిల్లలకు చేరుతాయని, ఈ విషయంలో, సమాజంలో వ్యాప్తి చెందుతున్న చెడును ఆపడం అత్యవసరమని పేర్కొంది.

నిషేధిత OTT యాప్‌లు జాబితా:

  • ALTT
  • ఉల్లు (ULLU)
  • బిగ్ షాట్స్ (Big Shots app)
  • బూమెక్స్ (Boomex)
  • డెసిఫ్లిక్స్ (Desiflix)
  • కంగన్ యాప్ (Kangan app)
  • నవరస లైట్ (Navarasa Lite)
  • గులాబ్ యాప్ (Gulab app)
  • జల్వా యాప్ (Jalva app)
  • బుల్ యాప్ (Bull app)
  • హిట్‌ప్రైమ్ (Hitprime)
  • వావ్ ఎంటర్టైన్మెంట్ (Wow Entertainment)
  • లుక్ ఎంటర్టైన్మెంట్ (Look Entertainment)
  • అడ్డా టీవీ (Adda TV)
  • ఫెనియో (Feneo)
  • షోఎక్స్ (ShowX)
  • సోల్ టాకీస్ (Sol Talkies)
  • హాట్ఎక్స్ VIP (HotX VIP)
  • హల్‌చల్ యాప్ (Hulchul app)
  • మూడ్ఎక్స్ (MoodX)
  • నియాన్‌ఎక్స్ VIP (NeonX VIP)
  • ఫుగి (-Fugi)
  • మోజ్ఫ్లిక్స్ (Mojflix)
  • ట్రిఫ్లిక్స్ (Triflicks)

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?