ACB Raids in Hyderabad | హైదరాబాద్ లో మరో అవినీతి అధికారి ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారి.. కేవలం డబ్బుపై ఆశతో లంచం తీసుకుంటుగా ఏసీబీ అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజేంద్రనగర్ (Rajendranagar) మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కె. రవికుమార్ ఓ హోటల్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఆయనను రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner) కె రవికుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మున్సిపల్ పరిధిలోని ఒక హోటల్‌లో ఇటీవల మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. కిచెన్‌లో అపరిశుభ్రంతో పాటు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు హోటళ్లపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. కాగా హోటల్‌ను సీజ్ చేయొద్దని రాజేంద్రనగర్ సర్కిల్ 11, డిప్యూటీ కమిషనర్ కె రవికుమార్‌ను కోరగా ఆయన ఏకంగా రూ. 5లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ తో శుక్రవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రవికుమార్ పట్టుబడ్డారు. అతడిపై కేసు నమోదు చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపించామని ఏసీబీ అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.