Bihar News : బీహార్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టుల పెన్షన్ (Journalist Pension) మొత్తాన్ని రెట్టింపు చేసింది. దీంతో బీహార్‌లో జర్నలిస్టులకు భారీ ఊరట లభించింది. బీహార్ పత్రకర్ సమ్మాన్ పెన్షన్ యోజన (Patarkar Samman Pension Yojana) కింద, ఇప్పుడు అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ ప్రతి నెలా రూ. 6 వేలకు బదులుగా రూ. 15 వేల పెన్షన్ మొత్తాన్ని అందిస్తారు. ముఖ్యమంత్రి నితిష్‌కుమార్ (Nitish Kumar) ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
ఎక్స్‌లో ఆయన ఒక పోస్టులో.. బీహార్ పత్రకర్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. 6,000 కు బదులుగా రూ. 15,000 పెన్షన్ అందించాలని శాఖను ఆదేశించినట్లు తెలియజేయడానికి నేను సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగే, బీహార్ పత్రకర్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్టులు మరణిస్తే, వారిపై ఆధారపడిన భర్త/భార్యకు జీవితాంతం నెలకు రూ. 3,000 కు బదులుగా రూ. 10,000 పెన్షన్ ఇవ్వనున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని తెలిపారు. వారు ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభమని, సామాజిక అభివృద్ధిలో భాగస్వాములవుతారని చెప్పారు. జర్నలిస్టులు తమ జర్నలిజం నిష్పాక్షికంగా చేయగలిగేలా, పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన రీతిలో వారి జీవితాన్ని గడపగలిగేలా మేము మొదటి నుండి జర్నలిస్టుల సౌకర్యాలను జాగ్రత్తగా చూసుకుంటున్నాము. అని బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.