డీఎన్‌ఏ టెస్టులతో బయటపడ్డ నిజాలు
IVF Scam in Hyderabad | తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ (Srushti Test Tube Baby Centre) కేసులో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఐవీఎఫ్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. జులై 27న ఆదివారం మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దారుణాలను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.
ఈనెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై కేసు నమోదు కావడంతో తెరవెనుక బాగోతాలు బయటకు వచ్చాయి. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని డీసీపీ వెల్లడించారు.. గతేడాది ఆగస్టులో ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను వైజాగ్‌కు పంపించారు. ఐవీఎఫ్ తో కాదు.. సరోగసి ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు. సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ లభించిందని, ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత రూ.30లక్షలు వసూలు చేశారు. అందులో రూ.15లక్షల చెక్కు రూపంలో, రూ.15లక్షలు బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అలాగే మెడికల్ టెస్టుల కోసం ఏకంగా రూ.66వేలు తీసుకున్నారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని సోనియా దంపతులను నమ్మబలికారు.
న్యూఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. అయితే దిల్లీలో డీఎన్‌ఏ టెస్ట్ చేయించడంతో అసలు గుట్టు బయటపడింది. మరొకరి డీఎన్‌ఏ అని తెలిసిపోవడంతో డాక్టర్ నమ్రత జాబితాలో చాలామంది డేటా ఉంది. బిడ్డను ఇచ్చినందుకు దిల్లీ మహిళకు రూ.90వేలు ఇచ్చారు. దంపతుల వద్ద మొత్తం రూ.40లక్షలు వసూలు చేశారు.
బాధిత కుటుంబం మాకు ఫిర్యాదుచేశారు. నమ్రత కొడుకు జయంత్ కృష్ణ అడ్వకేట్‌గా పని చేస్తూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై ఏదైనా కేసులు వస్తే తనే వాదించేవారు. వైజాగ్‌లోనూ సరోగసి ద్వారా నమ్రత అనేక గర్భధారణలు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఒక మహిళకు రూ.89వేలు ఇచ్చి వైజాగ్ తీసుకెళ్లి అక్కడ సర్జరీ అయ్యాక పాపని వాళ్లకు అప్పగించి మళ్లీ హైదరాబాద్‌కు పంపించారు. పేదలకు డబ్బు ఆశ చూపించి సరోగసీకి ఒప్పిస్తున్నారు నమ్రత. నమ్రతకు సంబంధించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లైసెన్సులు కాన్సిల్ చేశాం.ఆమె లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశాం. డాక్టర్ నమ్రతపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 10కి పైగా కేసులు నమోదయ్యాయని డీసీపీ.
రష్మీ పెరుమాళ్ తెలిపారు.
IVF Scam : సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏం చేసింది.
పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు తన భర్త స్పెర్మ్ తో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడికి కాన్సర్ రావడంతో అనుమానంతో దంపతులు డీఎన్‌ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బట్టబయలయింది. దీంతో వారు రెజిమెంటల్ బజార్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు షాక్‌కు గురయ్యారు. వంశంలో ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్‌ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్‌ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.