హైదరాబాద్-విజయవాడ మార్గంలో RTC బస్సులకు భారీ డిస్కౌంట్లు!
హైదరాబాద్-విజయవాడ రూట్లో రాకపోకలు సాగించేవారికి తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభవార్త చెప్పింది. ఈ మార్గంలో ప్రయాణించే బస్సుల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. కనీసం 16 శాతం నుంచి గరిష్ఠంగా 30శాతం వరకు టికెట్ ధరల్లో ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్లు ‘ఎక్స్’లో ఓ పోస్టులో పేర్కొంది.
దీని ప్రకారం.. గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్ ధరపై 30శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. అలాగే, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో 20 శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16శాతం మేర తగ్గించినట్లు తెలిపింది. ఈ రాయితీలు ఆన్లైన్ తోపాటు ఆఫ్లైన్ బుకింగ్లకు సైతం వర్తించనున్నాయి. . అలాగే టికెట్లు అధికారిక వెబ్ సైట్ https://www.tgsrtcbus.in/ లో బుక్ చేసుకోవాలని రెండు నగరాల మధ్య ప్రయాణికుల్ని ఆర్టీసీ సూచించింది.
TGSRTC ప్రకారం డిస్కౌంట్లు ఇలా ఉన్నాయి:
- గరుడ ప్లస్ బస్సులు – 30% తగ్గింపు
- ఈ-గరుడ బస్సులు – 26% తగ్గింపు
- సూపర్ లగ్జరీ, లహరి నాన్ AC బస్సులు – 20% తగ్గింపు
- రాజధాని, లహరి AC బస్సులు – 16% తగ్గింపు
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.