- మూసపేటలో ఆక్రమణల నుంచి పార్కుకు విముక్తి
- పార్కు స్థలంలో కబ్జాలు తొలగించిన హైడ్రా
హైదరాబాద్ (Hyderabad) లోని మూసీ నది (Musi River)లో ఆక్రమణలను హైడ్రా (HYDRAA) తొలగించింది. మూసీ పరీవాహక ప్రాంతంలోని చాదర్ ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా హాస్పిటల్ వరకు పలు అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా నేలమట్టం చేసింది. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి మూసీని ఆక్రమించి, పలు నిర్మాణాలు చేపట్టారు. వాటిని ప్రయివేట్ బస్సులకు, లారీలకు కిరాయికి ఇస్తున్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మూసీ ప్రాంతంలో విచారణ చేపట్టిన అధికారులు, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించారు.
మంగళవారం ఉదయం నుంచి పోలీసు భారీ బందోబస్తు మధ్య మూసీలో తిష్టవేసిన షెడ్డులను తొలగించారు.
ఇలా ఉండగా నగరంలోని మూసాపేట ఆంజనేయ నగర్‌లో అక్రమ నిర్మాణాలు, షాపులను తొలగించేందుకు హైడ్రా అధికారులు అక్కడకు వెళ్లగా స్థానికులు వారిని అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అడ్డుపడ్డారు. దీంతో అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.