Hyderabad | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) 2025–26 విద్యా సంవత్సరానికి ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు TSRTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్ శివారులోని హకీంపేట్‌లో ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులను టీఎస్ ఆర్టీసీ ఆహ్వానిస్తోంది. ఎనిమిది, పదో తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కాలేజీలో మోటార్ వెహికల్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్‌లలో కోర్సులు అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీలోగా టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 9100664452, 6302649844, 040-69400000 ఫోన్ నంబర్లను సంప్రదించాలి.
ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీ సూచనలు చేసింది. మెకానిక్ డీజిల్, వెల్డర్ కోర్సుల కాలవ్యవధి ఏడాది. ఇక మెకానిక్ (మోటర్ వెహికల్), పెయింట్ కోర్సులను రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. వెల్డర్, పెయింటర్ కోర్సులకు ఎనిమిదో తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులకు ఏడాదికి రూ.16,500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    