ACB Arrest | పెద్దపల్లి జిల్లా(Peddapalli)లో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పెద్దపల్లికి చెందిన ఓ రైతు నుంచి భూమి సర్వే చేసిన రిపోర్టు ఇవ్వడానికి సర్వేయర్ భారీగా లంచం డిమాండ్ చేశాడు. అందుకు ఆ రైతు కొంత మొత్తం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రూ.10,000 ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి ద్వారా మండల సర్వేయర్ పైండ్ల సునీల్ అకౌంట్ కు బదిలీ చేయగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న సర్వేయర్ పైండ్ల సునీల్ ఫోన్ పే ద్వారా రూ.10,000 లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఓ రైతు భూమి సర్వే చేసి పంచానమా ఇవ్వడానికి రూ.10 వేలు సర్వేయర్ సునీల్ డిమాండ్ చేయగా సదరు రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు.
ఏసీబీ అధికారుల సూచనల మేరకు సర్వేయర్ సునీల్ అకౌంట్ ఫోన్ పే ద్వారా 10000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్ సునీల్ తో పాటు ప్రైవేటు సర్వేయర్ రాజేందర్ రెడ్డిలను విచారించిన అనంతరం ఏసీబి కోర్టుకు తరలించనున్నట్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు.
లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయొచ్చు..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.