Transfer Thrimurthulu Movie | ఒకప్పుడు వరుస హిట్టు సినిమాలతో కుర్రకారును ఉర్రూతలూగించిన హీరో వడ్డే నవీన్ (Vadde Naveen)మళ్లీ యాక్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ లో సెలెబ్రెటీల ఇంటర్వ్యూల కింద కామెంట్స్ చూస్తే తన ఫాలోయింగ్ అప్పట్లో ఏ రేంజ్ లో ఉండేది అర్థం అవుతుంది. నవీన్ మళ్లీ ఎప్పుడూ యాక్ట్ చేస్తారో అని వెయిట్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వారందరూ కోరుకున్నట్టుగానే నవీన్ సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ హీరోగా అలరించబోతున్నాడు.
దాదాపు 15 ఏళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ వెటరన్ స్టార్ మళ్ళీ మేకప్ వేసుకున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈ హీరో. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి మూవీ అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఆ మూవీ తర్వాత నవీన్ కి యూత్ లో పాపులారిటీ పెరిగింది.
ఆ తర్వాత కోరుకున్న ప్రియుడు,బాగున్నారా,చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒ ట్టు మీ ఆవిడ చాలా మంచిది,మా బాలాజీ లాంటి హిట్లతో టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు.నవీన్ నుండి మూవీ వస్తుందంటే మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా,ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని అప్పటి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేవారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే తన మూవీస్ ఉండేవి.తర్వాత సరైన స్టోరీలను ఎంచుకోవడంలో తప్పటడుగులు వేసి వెనుకబడ్డాడు.
Vadde Naveen : శ్రీకాంత్, నవీన్ కాంబో సెన్సేషన్…
హీరో శ్రీకాంత్ తో నవీన్ కాంబో(Srikanth Naveen combo)ఒక సెన్సేషన్. వీరిద్దరు కలిసి యాక్ట్ చేసిన ఈవీవీ సినిమా చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన లాస్ట్ మూవీ ఆదిలక్ష్మి. ఇది కూడా ఓ మోస్తరుగానే ఆడింది. ఇక చాలా ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ ఇప్పుడు మరో మూవీతో ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమయ్యాడు.
వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు..
ఆయనే నిర్మాతగా వడ్డే క్రియేషన్స్ బ్యానర్ లో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (Transfer Thrimurthulu) అనే మూవీని తీస్తున్నాడు. కమల్ తేజ నార్ల (kamal Teja naarla) డైరెక్షన్ లో రాబోతున్న మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా నవీన్ అందిస్తున్నారు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీలో నవీన్ ఫస్ట్ లుక్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. పోలీస్ గెటప్ లో కనిపించి నవీన్ మూవీపై అంచనాలను పెంచేశారు. మళ్ళీ వింటేజ్ లుక్ లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దాదాపు 80శాతం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. రాశిసింగ్ (Rashi Singh) హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న మూవీలో రఘుబాబు, బాబా భాస్కర్,దేవీ ప్రసాద్ లాంటి వారు కీ రోల్ లో నటిస్తున్నారు. 
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    