War-2 Movie review | యంగ్ టైగర్ ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కాంబోలో హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన మూవీ వార్2. ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ కావడం, టాలీవుడ్, బాలీవుడ్ లో టాప్ యాక్టర్స్ మల్టీస్టారర్ కావడంతో ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేశారు. బాలీవుడ్ లో టాప్ బ్యానర్ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అయాన్ ముఖర్జీ ఈ మూవీని డైరెక్ట్ చేసారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేశారు.ఎన్టీఆర్ హృతిక్ ల కాంబోలో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను మెప్పించిందా…లేదా చూద్దాం.
స్టోరీ ఇదీ..
హృతిక్ రోషన్ ను పట్టుకోవడానికి పోలీసులు తెగ ప్రయత్నం చేస్తుంటారు. వారి ప్రయత్నాలు విఫలం అవుతుండడంతో అతడిని పట్టుకోవడానికి ఒక స్పై (ఎన్టీఆర్) ని సెలెక్ట్ చేస్తారు. స్పై అతడిని పట్టుకోవడంలో ఎదురయ్యే సమస్యలేంటీ..? అసలు అతడిని పట్టుకున్నాడా లేదా..? అనేది కథ.
War-2 మూవీ ఎలా ఉందంటే….
మూవీ ఒక రొటీన్ యాక్షన్ మూవీ. స్పై మూవీస్ ఇది వరకు మనం చాలానే చూశాం. స్టోరీ కొత్తగా లేకున్నా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ టేకాఫ్ చేసిన విధానం బాగుంది. ఇద్దరు టాప్ స్టార్స్ ను డీల్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు (War-2 Movie review). హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా పోటా పోటీగా యాక్ట్ చేసి అదరగొట్టారు. బేసిక్ గా స్పై మూవీస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇది కూడా ఆ కోవలోకే వెళుతుంది. అయితే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని ఊహించే ఆడియన్స్ కి డిసప్పాయింట్ చేసే విధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అయితే తేలిపోయిందని చెప్పొచ్చు. ఫస్టాప్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కవుట్ అయ్యాయి. వాటికి తగ్గట్టు ఇంకొంచెం బీజీఎం పడుంటే అదిరిపోయేలా రెస్పాన్స్ ఉండేది. ఇక ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. ఎన్టీఆర్, హృతిక్ ల మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. అక్కడ వొచ్చే ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.ఆడియన్స్ కి సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ ను తీసుకొస్తుంది. ఇక సెకండాఫ్ ను ఇంకాస్త బెటర్ మెంట్ చేసుంటే బాగుండేది. క్లైమాక్స్ కూడా ఆడియన్స్ థ్రిల్ అయ్యే విధంగా ఉండడం మూవీ కి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా అలరించింది.
నటీ నటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ మూవీని డీల్ చేసిన విధానం బాగుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా తీయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. మూవీ మొత్తం లో అదే మైనస్. ఇక ఇద్దరు టాప్ యాక్టర్స్ హృతిక్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. హృతిక్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఎన్టీఆర్ ఈ మూవీతో బాలీవుడ్ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడనడంలో సందేహం లేదు. హీరోయిన్ కియారా అద్వానీ కి పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా స్కోప్ లేదు. అయినా తనదైన శైలిలో ఆకట్టుకుంది. మిగతా ఆర్టిస్టులు తమ తమ పాత్రల మేరకు బాగానే యాక్ట్ చేశారు. ఇక ఒక సీన్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేది మ్యూజిక్. ఇంకాస్త బెటర్ మెంట్ గా ఇచ్చుంటే బాగుండేది. కొన్ని సీన్స్ మ్యూజిక్ వలనే ఎలివేట్ కాలేదని చెప్పొచ్చు.నిర్మాణ విలువలు బాగున్నా వీఎఫ్ ఎక్స్ అక్కడక్కడ తేలిపోయాయి.మొత్తంగా వార్2 ఫుల్ యాక్షన్ లవర్స్ కి పండుగనే చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్..
- హృతిక్ ఎన్టీఆర్ యాక్టింగ్
- ఇంటర్వెల్, క్లైమాక్స్
మైనస్ పాయింట్స్…
- రొటీన్ స్టోరీ
- సెకండాఫ్లో కొన్ని సీన్స్
- వీఎఫ్ఎక్స్
- బీజీఎం
రేటింగ్..
3.5/5
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








