Warangal News | వరంగల్ జిల్లాలో బీరు ప్రియులు ఆశ్చర్యానికి గురయ్యే ఘటన చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఓ వైన్ షాపులో కొనుగోలు చేసిన కింగ్ ఫిషర్ బీరు సీసాలో సోంపు ప్యాకెట్ బయటపడింది.
ఇల్లంద గ్రామంలో ఓ వ్యక్తి కింగ్ ఫిషర్ బీరు (Kingfisher Beer bottle ) కొనుగోలు చేశాడు. తాగడానికి ముందు బీరు సీసాను నిశితంగా పరిశీలించి చూడగా, అందులో సోంపు ప్యాకెట్ కనిపించడంతో అవాక్కయ్యాడు. వెంటనే సదరు వ్యక్తి వైన్ షాపు యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతతో కూడిన బీర్లను విక్రయించాలని హెచ్చరించాడు. ఇలా చెత్తాచెదారం ఉన్న బీర్లను అమ్మడం ఏమాత్రం సరైంది కాదని మండిపడ్డాడు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    