మహారాష్ట్రలోని ఉద్గిర్ సమీపంలో వరద (Floods) ల్లో తెలంగాణకు చెందిన ఫ్యామిలీ గల్లంతయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోవడం కలకలం రేపింది. మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం, పిల్లలూ జాగ్రత్త అంటూ చివరి ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత స్విచ్ఛాప్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు ఆచూకీ వెంటనే గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన ఐదుగురితో పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ వాహనాన్ని నడుపుతుండగా ఆగస్ట్ 17న అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరద నీటిలో కొట్టుకుపోయింది. మహారాష్ట్రలోని ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉద్గిర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కాగా, గల్లంతైన వారిలో అఫ్రీనా, హసీనా, సమీనా, ఆఫ్రీన్, సోహెబ్ అనే యువకుడు, మహారాష్ట్ర కు చెందిన కారు డ్రైవర్ సోహెబ్ ఉన్నారు. కార్ డ్రైవర్ వరద నీటి ప్రవాహం నుంచి ప్రాణాలతో బయటపడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్టు సమాచారం. వరదలో కొట్టుకుపోయిన వారిలో షేక్ అఫ్రీన్ తన భర్త సలీమ్ కు ఫోన్ చేసి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నామని పిల్లల్ని బాగా చూసుకోవాలని రోధిస్తూ చెప్పిందని, తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయిందని తెలిపారు. వీళ్లంతా నిజామాబాద్ బోధన్ కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. స్వగ్రామంలో ఉన్న పిల్లలు రాత్రి నుంచి తల్లి కోసం తల్లడిల్లుతున్న ఘటన కంటతడి పెట్టిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    