Sahasra Murder Case | కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో సీపీ అవినాష్ మహంతి విస్తుపోయే వాస్తవాలు మీడియాకు వెల్లడించారు. 14 ఏళ్ల పిల్లాడే తన ఇంటి పక్కన ఉంటున్న సహస్రను హత్య చేశాడని తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సహస్ర తమ్ముడితో తరచూ క్రికెట్ ఆడే నిందితుడికి ఆ పిల్లాడి వద్ద క్రికెట్ బ్యాట్ నచ్చింది. కానీ సహస్ర తమ్ముడు ఎక్కువగా ఆ బ్యాట్‌ని నిందితుడికి ఇచ్చేవాడు కాదు. ఎలాగైనా ఆ బ్యాట్ ను తీసుకోవాలని నిర్ణయించుకున్న 14 ఏళ్ల నిందితుడు.. దాని కోసమే సహస్ర ఇంటికి వెళ్లాడు. బ్యాట్ తీసుకొని.. వెనక్కి వస్తుండగా.. అదే సమయంలో సహస్ర చూసి కేకలు వేసింది. వెంటనే సదరు నిందితుడు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా కత్తితో పాశవికంగా పొడిచేశాడని పోలీసులు వెల్లడించారు.
మరి ఆ బ్యాట్‌ని తల్లిదండ్రుల ద్వారా కొనిపించుకోవచ్చు కదా అంటే.. ఆ పిల్లాడు.. అంత ఖరీదైన బ్యాట్‌ని తన తల్లిదండ్రుల ద్వారా కొనిపించే ఉద్దేశం తనకు లేదని చెప్పాడని పోలీసులు తెలిపారు.
ఈనెల 18న ఈ హత్య జరగగా.. అదే రోజు.. నిందితుడి తల్లి.. ఆ పిల్లాడిని ప్రశ్నించగా తనకేమీ తెలియదని బదులిచ్చాడని పోలీసులు చెప్పారు. ఆ తల్లి మరోసారి ఇదే విషయమై పిల్లాణ్ని అడిగితే ఆమెతో ఓ మాట స్లిప్ అయ్యాడు. “నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నావు. నీ మీద ఒట్టు. నాకేం తెలీదు” అని సమాధానం ఇచ్చాడు. దాంతో తల్లికి ఆ పిల్లాడిపై అనుమానం పోయింది. కానీ.. 3 రోజుల తర్వాత అతడే హంతకుడని అందరికీ తెలిసిపోయింది.
సహస్ర హత్యకేసులో సంచలన విషయాలు.. నెలరోజుల క్రితం నుంచే ప్లాన్.. నిందితుడు పోలీసులనే తప్పుదారి పట్టించాడు: సీపీ #sahasra #Kukatpally pic.twitter.com/jp2X2tXChH
— Sarkarlive.net (@sarkarlivenews) August 23, 2025
నెల రోజుల క్రితం నుంచే..
ఎలాగైనా క్రికెట్ బ్యాట్ కాజేయాలని నెల రోజులుగా ప్లాన్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. హత్య తర్వాత కత్తిని సహస్ర ఇంట్లోనే కడిగేసిన నిందితుడు.. సహస్ర కుటుంబం ఉంటున్న నాలుగో ఫ్లోర్ నుంచి.. తాను ఉంటున్న మూడో ఫ్లోర్‌కి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే కొంత సమయం వరకు గోడ వద్ద తిరిగాడు. ఉదయం 8 నుంచి 8.30 సమయంలో అతను అలా తచ్చాడుతుంటే.. ఓ పిల్లాడు చూశాడు. ఆ పిల్లాడి ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఈ కేసును ఆ కోణంలో దర్యాప్తు చేసి.. అతనే హత్య చేశాడని తేల్చారు.
అయితే కత్తిని కడిగిన నిందితుడికి.. షర్టుపై రక్తపు మరకలు ఉన్నాయి. ఇంట్లో తన తండ్రికి ఈ విషయం తెలియకుండా ఉండేందుకు.. బయట ఆరేసిన వేరే దుస్తులు వేసుకొని.. ఎవరికీ అనుమానం రాకుండా బాత్ రూంలోకి వెళ్లి స్నానం చేసేశాడు. అలాగే.. రక్తపు మరకలు ఉన్న దుస్తులను ఉతికేశాడు. దాంతో.. నిందితుడి ఇంట్లో వారికి.. అతనిపై అనుమానం కలగలేదు. కానీ విచారణలో భాగంగా పోలీసులు రక్తపు మరకల ఉన్న చొక్కాను సేకరించారు. ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా రక్తపు మరకల్ని గుర్తించారు. ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారించి సహస్ర కేసు (Sahasra Murder Case) ను ఛేదించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.