Tollywood News : ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఆడియన్స్ ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి.అలా సెట్ చేసిన డైరెక్టర్ సెన్సేషనల్ హిట్స్ తీసుంటే ఆ కాంబో మీద హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటి ఓ మాస్ కాంబినేషన్ సెట్ అయినట్టు ఫిలిం నగర్ లో టాక్ వినబడుతుంది.రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా (Rebal Star Prabhas, Sandeep Reddy Vanga combo..) కాంబినేషన్ లో ఓ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. మూవీకి స్పిరిట్(spirit)అనే టైటిల్ కూడా పెట్టారు. ప్రభాస్ ఒక కాప్ గా కనిపించబోతున్నారు.భారీ బడ్జెట్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు.
Tollywood News : భారీ బడ్జెట్ తో సినిమాలు.. అంతకంతకు వసూళ్లు….
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి.బడ్జెట్ ఎన్ని కోట్లయినా సరే ప్రొడ్యూసర్స్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే వారు పెట్టిన దానికి అంతకు రెండింతలు వసూలు చేసే సత్తా ప్రభాస్ కి ఉంది.బాహుబలి (Bahubali)మూవీ తర్వాత ఒకటి రెండు సినిమాలు అనుకున్నంత ఆడకపోయినా ఆ తర్వాత వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించాయి.
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సందీప్…
సందీప్ రెడ్డి వంగా సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. తన లాస్ట్ మూవీ యానిమల్ (animal)తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనకు తెలిసిందే. ఇక ప్రభాస్ నుండి మూవీ వస్తుందంటే చాలు ఆడియన్స్ 1000 కోట్లు వసూలు చేస్తుందని ముందే ఫిక్స్ అయిపోతున్నారు.ఇలా వీరిద్దరి కాంబినేషన్ కుదిరిందంటేనే ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో ట్రేడ్ పండితులు అంచనా వేయలేకపోతున్నారు. ఇదే ఒక మాస్ కాంబినేషన్ అంటే…ఈ మూవీలో మరో సెన్సేషనల్ స్టార్ యాక్ట్ చేస్తే థియేటర్లు దద్ధరిల్లడం ఖాయం.
ఫాదర్ క్యారెక్టర్ లో మెగాస్టార్…
ప్రభాస్ కి ఫాదర్ క్యారెక్టర్ లో మెగాస్టార్ చిరంజీవి ని తీసుకున్నారని టాక్ వినబడుతుంది. యానిమల్ మూవీలో ఫాదర్ క్యారెక్టర్ లో అనిల్ కపూర్ ని ఎలా హైలెట్ చేశారో మనం చూశాం. ఇక సందీప్ ఫేవరెట్ హీరో చిరు ను డైరెక్ట్ చేస్తే ఎలా చూపించబోతాడో ఊహించుకోవచ్చు.చిరుకి స్టోరీ చెప్పడం..ఒప్పుకోవడం జరిగిపోయినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ కంప్లీట్ అయి వచ్చే వేసవికి రెడీ అవ్వగా,అనిల్ రావిపూడి(Anil ravipudi)కాంబోలో మూవీ సెట్స్ పై ఉంది. ఇవేగాక బాబీ,శ్రీకాంత్ ఓదెల(babi, Srikanth odela)డైరెక్షన్లో సినిమాలు సైన్ చేశారు.ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ కుదిరిందనే టాక్ తో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానున్న ట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    