Karimnagar News | ఏసీబీ అధికారులు ఒక వైపు దాడులు ముమ్మరం చేస్తున్నా.. ఏదో ఒకచోట అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడుతూనే ఉన్నారు. చిన్న పనులకు కూడా పెద్ద మొత్తంలో లంచం (Bribe) డిమాండ్ చేస్తున్నారు. తాజాగా శుక్రవారం కరీంనగర్ జిల్లాలో ఓ లంచగొండి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంక (Veenavanka) మండలంలో పంచాయతీ కార్యదర్శి కంబం నాగరాజు చల్లూర్ గ్రామంలో ఇంటి నెంబర్ కేటాయించడానికి రూ.20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. చెప్పిన టైం లో డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలని సదరు కార్యదర్శి చెప్పాడు. దీంతో బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    