సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Hyderabad : విష జ్వరాలు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజనింగ్‌తో విద్యార్థులు ఆస్పత్రుల పాలవున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు.
గురుకులాల్లో 2,500 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించనిదుస్థితి నెలకొందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదు ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ స్వయంగా తానే ఇకపై గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు ఉత్తమాటలయ్యాయని విమర్శించారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు చేశారని కానీ, అవి గాలి మాటలయ్యాయయని అన్నారు.
కేసీఆర్ (Ex CM KCR) పదేళ్ల పాలనలో గురుకుల వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనలో నరకాన్ని తలపిస్తున్నాయని విమర్శించారు. నాడు 294గా ఉన్న గురుకులాల సంఖ్యను 1024 కి పెంచిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు. గురుకులాల్లో లక్ష 90 వేలుగా ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆరున్నర లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను కేసీఆర్ అందించారని తెలిపారు. విద్యపై చేసే వ్యయాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించిన కేసీఆర్ గురుకులాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారిందని అన్నారు. ఇది మీ అసమర్థత పాలనకు మరో నిదర్శనమని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








