సహకరించిన కుటుంబ సభ్యులు కూడా
Prakasam Incident | భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన అక్క, మేనల్లుడితోపాటు ఈ దారుణాన్ని వీడియో తీసిన బాలాజీ ప్రియురాలును సైతం అదుపులోకి తీసుకున్నారు. వివాహితను రెండు చేతులను రెండు కర్రలకు కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Prakasam Incident : ఏం జరిగింది?
భాగ్యలక్ష్మి అనే మహిళను బాలాజీ తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ కొంతకాలంగా భార్య పిల్లలను వదిలేసి బాలాజీ హైదరాబాద్‌లో మరో మహిళతో ఉంటున్నాడు. భార్య భాగ్యలక్ష్మి మాత్రం స్థానిక బేకరీలో పని చేస్తూ పిల్లలను చదివిస్తోంది.
గత శనివారం రాత్రి గ్రామానికి వచ్చిన బాలాజీ, డబ్బుల కోసం భార్యను వేధించాడు. ఆ తర్వాత రెండు చేతులను పాక గుంజలకు తాళ్లతో కట్టి, బెల్టుతో కొట్టడం, జుట్టు పట్టుకొని విరచడం, కాళ్లతో తన్నడం వంటి దారుణాలకు పాల్పడ్డాడు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు చిత్రహింసలు కొనసాగించాడని తెలుస్తోంది.
అయితే శనివారం గ్రామానికి వచ్చి భార్యను డబ్బుల కోసం వేధించి.. ఆమె రెండు చేతులను తాళ్లతో రెండు గుంజలకు కట్టేసి బెల్టుతో బాదుతూ, జుట్టుపట్టుకొని చేతులను వెనక్కి విరిచి కాళ్లతో తన్నుతూ రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశాడు. అతడి దాడులను తట్టుకోలేక ఆ అభాగ్యురాలు పెట్టిక కేకలు విని నెటిజన్లు చలించిపోయారు.
కాగా ఆమెపై దాడికి ప్రయత్నించగా తప్పించుకొని సమీపంలోని చర్చి వద్దకు వెళ్లడంతో భాగ్యలక్ష్మిని స్థానికులు కాపాడారు. మొదట పోలీసులు పట్టించుకోలేదని తెలిసింది. అనంతరం వీడియో బయటకు రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. బాలాజీతో పాటు కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు.
Horrible
Husband brutally tortures wife by tying her up, thrashing with belt, and kicking while she’s pleading.
A gruesome incident took place at Kalujuvvalapadu SC Colony in Tarlupadu Mandal of Prakasam district. @APPOLICE100 should initiate stern action on the accused… pic.twitter.com/1w4pUBv9wF
— Sowmith Yakkati (@YakkatiSowmith) September 16, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    