- ప్రభుత్వ ఫీజు గోరంత.. మామూళ్లు కొండంత..
- లంచాల లావాదేవీలకు ఐదుగురే కింగ్ పిన్లు
- డీటీవో, ఏఎంవీఐలను “సంతోష” పెడుతున్న ఉద్యోగి
Mahaboobabad RTO corruption : ఆ కార్యాలయంలో లంచాలు చాలా కాస్ట్లీగా ఉంటాయట. కార్యాలయంలో ఏ సేవలైన సాఫీగా సాగాలంటే సదరు కార్యాలయ ఉన్నతాధికారి ఫిక్స్ చేసిన మామూళ్లు(లంచాలు) పరోక్షంగా చెల్లించక తప్పదని జిల్లా వ్యాప్తంగా వాహనదారులు కోడైకూస్తుండడంతో సదరు అధికారుల వ్యవహారం ఇప్పుడు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం.ఆ రవాణా శాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఫీజుల కంటే సంబంధిత అధికారులకు ఇచ్చే మామూళ్లే ఎక్కువ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని తెలుస్తోంది.ప్రభుత్వ ఫీజు గోరంత ఉంటే మామూళ్లు (Bribes) కొండంత ఉంటాయని మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళిన వాహనదారులు బహిరంగంగా నే మాట్లాడుకోవడం గమనార్హం.
RTO corruption : లంచాల లావాదేవీకి ఐదుగురే ‘కింగ్‌పిన్లు’
మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు తీసుకుంటున్న లంచాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లంచాల లావాదేవీలకు ఆ ఐదుగురు బడా ఏజెంట్ లే కింగ్ పిన్లు గా ఉన్నారని సమాచారం. కార్యాలయంలో ఏ ఫైలు కదలాలన్నా సదరు ఐదుగురి బడా ఏజెంట్ ల ద్వారానే కదులుతున్నట్లు తెలుస్తోంది. వాహనదారులకు కార్యాలయంలో ఏ పని కావాలన్న ఏజెంట్ లను సంప్రదించటం, వారు అడిగింది సమర్పించడం బహిరంగంగా కనపడుతున్నప్పటికి,అసలు రహస్యం ఆ ఐదుగురు కార్యాలయంలోనికి పంపే మెసేజ్ లలోనే ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది.కార్యాలయం వెలుపల ఉండే ఏజెంట్లందరికి ఈ ఐదుగురు బడా ఏజెంట్ లే సుప్రీం అని వీరి ద్వారా వెళ్తే మాత్రమే ఫైళ్లకు మోక్షం ఉంటుందని ఏజెంట్ లు సైతం బహిరంగంగా మాట్లాడుకోవడం కొసమెరుపు. వాహనదారుల నుండి అలాగే చోటా మోటా ఏజెంట్ లనుండి ఈ ఐదుగురు బడా ఏజెంట్ లు లంచాల (RTO corruption) రూపంలో వసూళ్లు చేసిన మొత్తాన్ని సాయంత్రం అధికారులు చెప్పిన వ్యక్తులకు పువ్వుల్లో పెట్టి మరీ అప్పగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అధికారులను “సంతోష” పెడుతున్న ఉద్యోగి
మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయం (Mahaboobabad RTO Office) లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులతోపాటు, మిగిలిన ఉద్యోగులందరిని “సంతోష”పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కార్యాలయ పరిధిలో ఉన్న ఏజెంట్లకు పెద్ద దిక్కుగా మారిన సదరు ఉద్యోగి అటు ఏజెంట్లకు లీడర్లు గా ఉన్న ఐదుగురు పెద్ద ఏజెంట్లకు, ఇటు డిటివో, ఏఎంవీఐ లతో పాటు మిగిలిన ఉద్యోగులకు మధ్య పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరిని “సంతోష’ పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏజెంట్లకు లీడర్లుగా కొనసాగుతున్న సదరు ఐదుగురు బడా ఏజెంట్ల నుండి ఆ ఫోన్కు మెసేజ్ రాగానే ఫైళ్లు అప్రూవ్ అయ్యేటట్టు చూసుకునే సదరు ఉద్యోగి అటు ఏజెంట్లకు ఇటు మిగిలిన స్టాఫ్ కు మధ్యవర్తిగా కొనసాగుతూ ఏజెంట్లతోపాటు అధికారులను సంతోషపెడుతున్నట్లు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏ సర్వీస్ కు ఎంత వసూళ్లు చేస్తున్నారు అనేది ఈ క్రింద పట్టికలో చూడచ్చు..
లైసెన్స్ కేటగిరీ
| సర్వీస్ | ప్రభుత్వ ఫీజు | లంచం | 
|---|---|---|
| లెర్నింగ్ లైసెన్స్ కు | రూ.550 | ఎంవీఐకి రూ. 900 క్లర్క్ కు రూ.100 | 
| పర్మినెంట్ లైసెన్స్ | రూ.1435 | ఎంవీఐ రూ.1500 | 
| హెవీ లైసెన్స్ | రూ.1700 | ఎంవీఐకి రూ.3300 | 
| ట్రాన్స్ పోర్ట్ లైసెన్స్ | రూ.1435 | ఎంవీఐకి రూ.2100 | 
కొత్త వాహన రిజిస్ట్రేషన్లు
| సర్వీస్ | ప్రభుత్వ ఫీజు | లంచం | 
|---|---|---|
| టూ వీలర్ | లేదు | ఎంవీఐకి రూ.250 ఏవోకు రూ.100 క్లర్క్ కు రూ.100 | 
| కార్లు | లేదు | ఎంవీఐకి రూ.600 ఏవోకు రూ.200 క్లర్క్ కు రూ.200 | 
| త్రీవీలర్ & ఆటో రిక్షా ప్యాసింజర్ | లేదు | డీటీవోకు రూ.2000 ఎంవీఐకి రూ.600 ఏవోకు రూ.200 క్లర్క్ కు రూ.200 | 
| ఎల్ఎంవీ గూడ్స్ | లేదు | డీటీవోకు రూ.200 ఎంవీఐకి రూ.1200 ఏవోకు రూ.200 క్లర్క్ కు రూ.200 | 
| ట్రాక్టర్ ట్రాలీ | లేదు | డీటీవోకు రూ.800 ఎంవీఐకి రూ.1500 ఏవోకు రూ.300 క్లర్క్ కు రూ.300 | 
| మోటార్ క్యాబ్ | లేదు | డీటీవోకు రూ.2200 ఎంవీఐకి రూ.1400 ఏవోకు రూ.500 క్లర్క్ కు రూ.500 | 
| మీడియం గూడ్స్ వెహికిల్ | లేదు | డీటీవోకు రూ.2200 ఎంవీఐకి రూ.2200 ఏవోకు రూ.500 క్లర్క్ కు రూ.500 | 
| హెవీ గూడ్స్ వెహికిల్ | లేదు | డీటీవోకు రూ.3200 ఎంవీఐకి రూ.5500 ఏవోకు రూ.1000 క్లర్క్ కు రూ.1000 | 
| జెసిబి | లేదు | డీటీవోకు రూ.2200 ఎంవీఐకి రూ.2400 ఏవోకు రూ.500 క్లర్క్ కు రూ.500 | 
| హార్వెస్టర్ | లేదు | డీటీవోకు రూ.5500 ఎంవీఐకి రూ.2400 ఏవోకు రూ.1000 క్లర్క్ కు రూ.1000 | 
ఫిట్ నెస్
| సర్వీస్ | ప్రభుత్వ ఫీజు | లంచం | 
|---|---|---|
| ఆటో రిక్షా | రూ.700 | ఎంవీఐకి రూ.400 క్లర్క్ కు రూ.100 | 
| ఎల్ఎంవీ గూడ్స్ | రూ.900 | ఎంవీఐకి రూ.1000 క్లర్క్ కు రూ.100 | 
| ట్రాక్టర్, ట్రాలీ | రూ.900 | ఎంవీఐకి రూ.1400 క్లర్క్ కు రూ.100 | 
| మోటార్ క్యాబ్ | రూ.900 | ఎంవీఐకి రూ.900 క్లర్క్ కు రూ.100 | 
| మీడియం గూడ్స్ వెహికిల్ | రూ.1100 | ఎంవీఐకి రూ.1800 క్లర్క్ కు రూ.100 | 
| హెవీ గూడ్స్ వెహికిల్ | రూ.1100 | ఎంవీఐకి రూ.2200 క్లర్క్ కు రూ.100 | 
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    