Violence among friends : హైదరాబాద్ (Hyderabad ) నగరంలోని పేటబషీరాబాద్ (Petbasheerabad)లో ఘోరం చోటుచేసుకుంది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన స్వల్ప వాగ్వాదం ఘర్షణగా మారి ఒకరి ప్రాణాలను బలిగొంది. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
Violence among friends : అసలు ఏం జరిగిందంటే…
దులపల్లి (Dulapally) ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ (37) స్టీల్ సిటీ ప్రాంతంలో పలు షెడ్లను (owned several sheds) కలిగి ఉండేవాడు. వాటిని అద్దెకు ఇచ్చి జీవనం సాగించేవాడు. అతడి స్నేహితుడు అలీ ఆటో ట్రాలీల ( auto-trolleys)ను నడిపేవాడు. ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉండేవి. భారీ సరుకు రవాణా అవసరమయ్యే కస్టమర్లను అలీ తరచూ షాపూర్‌నగర్‌కు చెందిన క్రేన్ ఆపరేటర్ (crane operator) ఆనంద్‌కు సూచించేవాడు…
అమెరికాలో పోలీసుల కాల్పులు.. యువకుడి మృతి
Mahabubnagar : అమెరికా (United States)లో జరిగిన ఓ ఘటనలో మహబూబ్‌నగర్ జిల్లా రమయ్యబౌళి ప్రాంతానికి చెందిన యువకుడు పోలీసుల కాల్పుల కు గురై ప్రాణాలు (shot dead) కోల్పోయాడు. 15 రోజుల క్రితమే ఈ సంఘటన జరిగినప్పటికీ అతడి స్నేహితులు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహబూబ్‌నగర్ జిల్లా రమయ్యబౌళి ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్ (34) 2016లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. చదువులు పూర్తయ్యాక కాలిఫోర్నియా (California)లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. నలుగురితో కలిసి ఓ రూమ్‌ను అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే రూమ్‌మేట్స్‌తో విభేదాలు ఉధృతమై చివరికి ప్రాణాంతక పరిణామానికి దారితీశాయి.
రూమ్‌మేట్స్‌తో వాగ్వాదం.. పోలీసుల కాల్పులు
కాలిఫోర్నియా (California) మీడియా కథనాల ప్రకారం.. నిజాముద్దీన్, అతడి రూమ్‌మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరు మద్య ఒకరినొకరు ‘కాలుస్తామనే’ స్థాయికి బెదిరింపులు వెల్లువెత్తాయి. పరిస్థితి అదుపు తప్పుతోందనే భయంతో రూమ్‌మేట్స్‌లో ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. అయినా పరిస్థితి నియంత్రణలోకి రాకపోవడంతో చివరికి పోలీసులు గాల్లో కాల్పులు ప్రారంభించారని, ఈ క్రమంలో బుల్లెట్లు తాకి నిజాముద్దీన్ కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడని సమాచారం.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిజాముద్దీన్ తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రిటైర్డ్ టీచర్ అయిన అతడి తండ్రి హస్నుద్దీన్ కేంద్ర ప్రభుత్వాన్ని తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. “నా కొడుకు చాలా కష్టపడి చదువుకున్నారు. పెద్ద స్థాయికి ఎదగాలని కలలు కనేవాడు. కానీ ఇలా అమెరికాలో చనిపోవడం దారుణం” అని కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఘటనతో మహబూబ్‌నగర్‌లోనే కాకుండా యావత్ తెలంగాణలో కలకలం రేగింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రూమ్‌మేట్స్ మధ్య తగాదాలు ఈ స్థాయికి చేరుకోవడం, పోలీసులు సకాలంలో పరిష్కరించలేకపోవడం వంటి అంశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ఈ కేసుపై అమెరికా (United States) పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజాముద్దీన్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడంలో ఎటువంటి అవరోధాలు లేకుండా చూడాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    