Sarkar Live

MBBS, BDS admissions | వైద్య విద్య‌ స్థానిక‌త‌పై హైకోర్టు కీల‌క తీర్పు

MBBS, BDS admissions : తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఒక కీలక తీర్పును వెలువరించింది. ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) సీట్లలో లోకల్‌ కోటా (local quota) విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ

MBBS, BDS admission

MBBS, BDS admissions : తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఒక కీలక తీర్పును వెలువరించింది. ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) సీట్లలో లోకల్‌ కోటా (local quota) విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ కొంతమంది విద్యార్థులు వేసిన పిటిషన్లను తిరస్కరించింది. దీంతో రాష్ట్రంలో వైద్య కోర్సుల అడ్మిషన్లలో లోకల్‌ కోటా అమలుకు ఎలాంటి అడ్డంకి లేకుండా మార్గం సుగమమైంది.

ప్ర‌భుత్వ ఉత్తర్వుల‌పై అభ్యంత‌రాలు

కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్ (Kaloji Narayana Rao University of Health Sciences) నుంచి వచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ మొత్తం 34 మంది విద్యార్థులు జులై 15న కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 33, 150ల (government’s orders)ను చెల్లనివిగా ప్రకటించమని పిటిషన్ దాఖ‌లు చేశారు. తాము ఇంటర్‌ విద్యను తెలంగాణలో పూర్తి చేసినా, గతంలో స్కూల్‌ చదువు బయట రాష్ట్రాల్లో జరిగిందని, కాబట్టి దానివల్ల లోకల్‌ హక్కు కోల్పోవడం అన్యాయమని విన్నవించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఈ జీవోలు ఉల్లంఘిస్తున్నాయని వాదించారు.

MBBS, BDS admissions : జీవో 150 స‌రైన‌దేన్న న్యాయ‌మూర్తులు

ముఖ్య న్యాయమూర్తి అపరేశ్‌ కుమార్‌ సింగ్ (Chief Justice Aparesh Kumar Singh), జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్ ( Justice G.M. Mohiuddin)తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్ల వాదనలను విన్న అనంతరం ప్రభుత్వం జారీ చేసిన జీవో 150 సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉందని స్పష్టం చేసింది. ఆ జీవోను రద్దు చేయాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. దీనికి ముందు ప్రభుత్వం నుంచి కోర్టు వివరణ కోరింది. స్థానిక హోదాను నిర్ణయించే ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వం తన సమాధానాన్ని సమర్పించగా దానిని పరిశీలించిన కోర్టు పిటిషనర్ల వాదనలు బలహీనంగా ఉన్నాయని తేల్చింది. చివరగా పిటిషన్లను కొట్టివేసింది.

విచార‌ణ‌లో వెలుగు చూసిన ప్ర‌త్యేక అంశం

ఈ విచారణలో ఒక ప్రత్యేక అంశం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని సైనిక్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన శశికిరణ్‌ అనే విద్యార్థిని లోకల్‌గా పరిగణించాలా లేదా? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. అందులో శశికిరణ్‌ను లోకల్‌ అభ్యర్థిగా పరిగణించి లోకల్‌ కోటాలో అడ్మిషన్‌ కల్పిస్తామని తెలిపింది.

స్ప‌ష్ట‌త ఇచ్చిన హైకోర్టు

హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలోని అనేకమంది విద్యార్థులకు స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా ఇంటర్‌ చదువు తెలంగాణ (intermediate education in Telangana)లో పూర్తి చేసినా స్కూలింగ్‌ ఇతర రాష్ట్రాల్లో జరిగిందని చెప్పుకొనే విద్యార్థులకు స‌మాధానం ల‌భించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమైనదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్లలో లోకల్‌ కోటా కొనసాగనుంది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ భాగం చదువుకున్న విద్యార్థులకు ఇది వర్తించకపోవచ్చు. దీంతో స్థానిక విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. పిటిషన్ వేసిన విద్యార్థులు కొంత నిరాశ చెందినా, లోకల్‌ విద్యార్థులు మాత్రం ఈ తీర్పుతో ఉపశమనం పొందారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?