Sarkar Live

BC Reservations : ‘స్థానిక’ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు.. త్వ‌ర‌లో జీవో

BC Reservations : తెలంగాణ‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలకు (బీసీలు) 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations )

BC Reservations

BC Reservations : తెలంగాణ‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలకు (బీసీలు) 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations ) కేటాయించేందుకు రంగం సిద్ధ‌మైంది. కొత్తగా జీవో జారీ (government order (GO) చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న‌ రెండు రోజుల్లోనే ఉత్త‌ర్వులు విడుదల కానున్నాయ‌ని అధికార వర్గాలు ధృవీకరించాయి.

జిల్లా స్థాయిలో ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టర్లు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) ఏయే స్థానాలను రిజర్వ్ చేయాలనే క‌స‌ర‌త్తును పూర్తి చేశారు. మండల పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ (MPTCs), జిల్లా పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ (ZPTCs), మండల ప్రెసిడెంట్ (MPPs), సర్పంచ్, వార్డు మెంబర్ పదవుల వరకు అన్ని స్థానాలనూ ఖరారు చేసి వివరాలను సిద్ధం చేశారు. ప్రభుత్వ ఉత్త‌ర్వులు విడుదల చేసిన వెంటనే ఈ రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటిస్తారు.

డ్రా ద్వారా మహిళల రిజర్వేషన్లు

బీసీలతో పాటు మహిళలకు కూడా రిజర్వేషన్లు అమలు చేస్తారు. అయితే.. మహిళలకు రిజర్వు చేసే స్థానాలను డ్రా ఆఫ్ లాట్స్ (లాటరీ విధానం) ద్వారా ఖరారు చేయనున్నారు. దీంతో ఎవరికి ఏ స్థానంలో అవకాశం వస్తుందో పూర్తిగా లక్కుపైనే ఆధారపడి ఉంటుంది.

BC Reservations : జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ స్థానాల పంపకం

తెలంగాణ వ్యాప్తంగా జిల్లా పరిషత్ చైర్‌ప‌ర్స‌న్ స్థానాల్లో 13 బీసీలకు, 5 ఎస్సీలకు, 3 ఎస్టీలకు కేటాయించబోతున్నారు. మిగిలిన 10 స్థానాలు జనరల్ కేటగిరీకి వస్తాయి. వీటిలో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేస్తారు. ఈ విధంగా బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీకి కూడా తగిన ప్రాధాన్యం ఉంటుంది.

రిజర్వేషన్ల కింద భారీ సంఖ్యలో స్థానాలు

తెలంగాణలో స్థానిక సంస్థల్లో మొత్తం 565 జ‌డ్పీటీసీ, 5,763 ఎంపీటీసీ స్థానాలు, 12,760 సర్పంచ్ పదవులు ఉన్నాయి. ఇవన్నీ రిజర్వేషన్ల ప్రకారం మ్యాప్ చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ఆధారంగా ఖరార‌వుతాయి. అయితే.. బీసీల రిజర్వేషన్లు మాత్రం ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వే ఆధారంగా అమలు చేస్తారు.

BC reservations : అధికారులకు కఠిన హెచ్చరిక

రిజర్వేషన్లపై పూర్తి జాబితా సిద్ధంగా ఉన్నా, అధికారికంగా జీవో విడుదలయ్యే వరకు ఏ విధమైన సమాచారం బయటకు రాకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అధికారులు (Officials) వివరాలు లీక్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

దీపావళికి ముందు ఎన్నికల షెడ్యూల్

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను దీపావళికి ముందే పూర్తి చేయాలనే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం గెజిట్ కూడా విడుదల కానుంది.

హైకోర్టులో పిటిషన్ దాఖలు

ఈ ప్రక్రియకు అవసరమైన గడువు సెప్టెంబర్ 30న ముగియనుండటంతో దానిని పొడిగించమని తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనుంది. గడువు పెంచితే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసి, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?