OG Movie Review ఓజీ మూవీ రివ్యూ : కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ ఫీవర్ తో ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఓజీ.. ఓజీ అని అరుస్తూనే ఉన్నారు. పవన్ వరుస ఫ్లాప్ ల తరవాత హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. పవర్ స్టార్ ఫ్యాన్ బాయ్ సుజీత్ డైరెక్షన్ లో సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లో (SCU) భాగంగా డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…..
స్టోరీ…
జపాన్ లో ఉండే ఓజాస్ గంభీరా (Pawan Kalyan)ఒక దాడి వల్ల ఇండియాకు వస్తాడు. అక్కడ ఒక సిట్యువేషన్ లో సత్య దాదా(Prakash Raj)ను కాపాడతాడు. ఆ తర్వాత వారిద్దరూ బొంబాయి చేరుతారు. అక్కడ సత్యదాదా డాన్ గా ఎదగగా, అతడి కింద ఓజాస్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ఓజాస్ గంభీరా బొంబాయి వీడి నాసిక్ చేరుతాడు. అక్కడ కన్మణి (Priyanka mohan) ని మ్యారేజ్ చేసుకుని హ్యాపీ గా ఉంటాడు. ఇక బొంబాయిలో సత్యదాదాపై అతడి స్నేహితుడు మీరజ్ కర్ కొడుకు ఓమీ (Imran Hashmi) ఎటాక్ చేస్తాడు. అప్పుడు ఓజీ తిరిగి వస్తాడా..? అతడు బొంబాయి వీడడానికి కారణమేంటి..? సత్యదాదా మనువడు అర్జున్ (Arjun das) ఓజీనే ఎందుకు చంపాలనుకున్నాడు..? తెలియాలంటే మూవీ చూడాల్సిందే..
OG Movie Review : మూవీ ఎలా ఉందంటే…
ఒక ఫ్యాన్.. డైరెక్టర్ అయితే మూవీ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఈ సినిమా తో సుజీత్ మళ్లీ ప్రూవ్ చేశాడు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కొన్నాళ్లుగా పవర్ స్టార్ సినిమాలు అనుకున్నంత ఆడకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా తో వారి ఆకలి తీరుతుందనిపించింది. (OG Movie Review) సినిమా టైటిల్ కార్డు పడగానే ఫ్యాన్స్ ఓజీ మేనియా స్టార్ట్ అవుతుంది. అంతలా ఫ్యాన్స్ గోలగోల చేసేలా టైటిల్ కార్డు క్రియేట్ చేశారు. అక్కడి నుండి మొదలు ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎలివేషన్ షాట్స్ తో మూవీని పిక్స్ కి తీసుకెళ్లాడు.రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామానే అయినా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు.కొద్దిగా అక్కడక్కడ సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. ఇక ఇంటర్ వెల్ బ్యాంగ్ ఆడియన్స్ ని సీటు ఎడ్జ్ లో కూర్చోబెట్టే విధంగా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సెకండాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మూవీ కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. అక్కడక్కడ హీరో ఎలివేషన్ షాట్స్ తో ఆడియన్స్ లో మళ్ళీ హుషారు తెప్పిస్తాడు. క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. అన్నీ ఉన్నా ఏ మూవీకైనా ఎమోషన్స్ వర్కవుట్ కాకపోతే ఏదో మైనస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఈ మూవీలో అన్నీ బాగున్నా ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. అది కూడా సరిగ్గా కుదురింటే మూవీ మరో లెవెల్ కి వెళ్ళేదని అనిపించింది. పార్ట్ 2 తీసేలా హింట్ కూడా ఇచ్చారు. అందులో ఏ లెవెల్ లో ఓజీ ని తీసుకొస్తారో చూడాలి…
నటీ నటులు, సాంకేతిక నిపుణుల పనితీరు….
ఓజాస్ గంభీరా గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇలాంటి యాక్టింగ్ చాలా ఏళ్ల తర్వాత చూసామనిపిస్తుంది. గ్యాంగ్ స్టర్ గా అదరగొట్టారు. వింటేజ్ లుక్ తో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. థియేటర్లు బ్లాస్ట్ అయ్యేలా తనదైన యాక్టింగ్ తో అదరగొట్టాడు. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర స్కోప్ తక్కువున్న పర్వాలేదని అనిపిస్తుంది. ఓమీగా హిమ్రాన్ హష్మీ పవర్ ఫుల్ గా అనిపించాడు. తన విలనిజం తో ఆకట్టుకున్నాడు. సత్యదాదాగా ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్, శ్రియా రెడ్డి, రాహుల్ రవీంద్రన్, మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగానే యాక్ట్ చేశారు.ఇక పవన్ కళ్యాణ్ కాకుండా మరో ఇద్దరు హీరోలున్నారు. ఒకరు మూవీ డైరెక్టర్ సుజీత్, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఫ్యాన్ బాయ్ సుజీత్ తన పవర్ స్టార్ తెరపై ఎలా ఉండాలి అనుకున్నాడో అలా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కథ చెప్పడంలో అక్కడక్కడ కొద్దిగా తడబడిన ఫ్యాన్స్ కి ఆది మైనస్ పాయింట్ కానే కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఇక తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు.తన బీజీఎం తో ఒక్కో షాట్ ఓ రేంజ్ లో ఎలివేట్ అయ్యాయి.యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి.నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫి బాగుంది.మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో బాక్సాఫీస్(OG Movie Public Talk) కి మరోసారి రిపీట్ చేసిన మూవీగా ఉంది.
ప్లస్ పాయింట్స్…
- పవన్ కల్యాణ్ యాక్టింగ్
- తమన్ బీజీఎం
మైనస్ పాయింట్స్..
- అక్కడక్కడ సాగదీత సీన్లు
- ఎమోషన్స్
రేటింగ్…
4.5/5
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    