Miyapur Murder Case : హైదరాబాద్ మియాపూర్ (Miyapur) ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రీహాబిలిటేషన్ సెంటర్ (rehabilitation centre )లో ఘోర ఘటన సంఘటన చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాల వ్యసనానికి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని అదే సెంటర్‌లోని ఇద్దరు సహచరుల చేతిలో హత్యకు గురైనట్టు వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కు చెందిన సందీప్ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి (addicted to drug) వ్యసనపరుడిగా మారాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు సుమారు తొమ్మిది నెలల క్రితం హైదరాబాద్‌లోని రీహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించారు. మాదక ద్రవాలను వీడి అతడు సాధారణ జీవితాన్ని గడుపుతాడని భావించారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లా (Nalgonda district)కు చెందిన ఆదిల్, హైదరాబాద్ బార్కస్‌కు చెందిన సులేమాన్ కూడా మూడు నెలల క్రితం ఈ రీహాబిలేషన్ సెంటర్‌లో చికిత్స కోసం చేరారు. బుధవారం రాత్రి సందీప్‌తో ఆదిల్, సులేమాన్‌కు తీవ్ర వాగ్వాదం జరిగింది. తాను ఇప్పుడే కోలుకుంటున్నానని, ప్రశాంతంగా ఉంటున్న తనను ఆదిల్, సులేమాన్ డిస్టర్బ్ చేస్తున్నారని సందీప్ ఆవేదన వ్యక్తం చేయడంతో గొడవ మొదలైంది. తమను అంత మాట అంటావా అంటూ సందీప్‌పై ఆదిల్, సులేమాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడిన సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
Murder case : దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు (Miyapur police) సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు దుండగులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు రీహాబిలిటేషన్ సెంటర్ సిబ్బందిని, అక్కడ ఉన్న ఇతర రోగులను విచారిస్తున్నారు. ఘటన సమయంలో ఎవరెవరు అక్కడ ఉన్నారు, దాడికి ముందు ఏమైనా హెచ్చరికలు ఉన్నాయా.. సెంటర్‌లో భద్రతా చర్యలు తగినంతగా ఉన్నాయా? అనే కోణాల్లో కూడా దర్యాప్తు సాగుతోంది.
ప్రశ్నార్థకంగా భద్రత
ఈ ఘటనతో రీహాబిలిటేషన్ సెంటర్ల భద్రతా ప్రమాణాలపై పెద్ద ప్రశ్నలు తలెత్తాయి. వ్యసనంతో బాధపడుతున్నవారిని మానసికంగా, శారీరకంగా రక్షించడం ఇలాంటి సెంటర్ల ప్రధాన బాధ్యత. సిబ్బంది పర్యవేక్షణ లోపం, రోగుల మధ్య గొడవలను ముందుగానే గుర్తించి అరికట్టడంలో వైఫల్యం వంటి అంశాలు ఈ ఘటనతో బయటపడ్డాయి. సందీప్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యసనాన్ని వదిలి సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడని ఆశించి సెంటర్‌లో చేర్చినా అక్కడే అతని ప్రాణం పోవడం దారుణమని కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    