Telangana new liquor policy 2025 : తెలంగాణ ప్రభుత్వం ప్రతి రెండేళ్లకోసారి మద్యం దుకాణాల లైసెన్స్‌లను పునరుద్ధరిస్తూ కొత్త పాలసీని అమలు చేస్తోంది. 2025-2027 కాలానికి కొత్త మద్యం రీటైల్ పాలసీని ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలకు సంబంధించిన దుకాణాల అనుమతులు, లైసెన్స్‌లు, రిజర్వేషన్లు, టెండర్ ప్రక్రియ తదితనన అంశాలపై సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది.
మద్యం పాలసీ ముఖ్యోద్దేశం ఏమిటి?
మద్యం పాలసీ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మద్యం విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 40,000 కోట్లకు పైగా ఆదాయం పొందుతోంది. ఒక్క కొత్త లైసెన్స్‌లు, రిన్యువల్స్ ద్వారా సుమారు రూ.6,000 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. రాష్ట్రానికి ఆదాయం పెంచడం మాత్రమే కాకుండా విక్రయాల్లో పారదర్శకతను తీసుకురావడమే మద్యం కొత్త పాలసీ ముఖ్యోద్దేశం.
దుకాణాల కేటాయింపులో సామాజిక న్యాయం కల్పించడం, మద్యం అక్రమ విక్రయాలను అరికట్టడం, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడం కూడా.
liquor policy 2025 : లైసెన్స్ కాలవ్యవధి.. ఫీజులు
కొత్త పాలసీ ప్రకారం ప్రతి లైసెన్స్ రెండేళ్లపాటు చెల్లుతుంది. లైసెన్స్ ఫీజు ప్రాంతానుసారంగా నిర్ణయించబడింది. GHMC, మునిసిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ పరిధుల్లో ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
షాపులకు అప్లై ఎలా చేయాలి?
- తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ (Telangana excise department) అధికారిక వెబ్‌సైట్ https://excise.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేయాలి.
- అభ్యర్థి పేరు, ఆధార్ నంబర్, చిరునామా, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వంటి వివరాలతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
- ఆధార్ కార్డ్ / పాన్ కార్డ్, చిరునామా రుజువు, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC), బిజినెస్ లొకేషన్ మ్యాప్, బ్యాంక్ గ్యారంటీ / డిపాజిట్ వివరాలు తదితర డ్యాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
- దరఖాస్తు సమర్పణ సమయంలో రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయాలి. ఎంపికైతే ఆ మొత్తం లైసెన్స్ ఫీజులో భాగంగా పరిగణిస్తారు. ఎంపిక కాలేకపోతే డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు.
- దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత, లాటరీ పద్ధతిలో ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది.
సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లు
కొత్త పాలసీలో మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ (liquor shop reservations) విధానం ఈ విధంగా ఉంది:
- SC (షెడ్యూల్డ్ కాస్ట్స్) 15%
- ST (షెడ్యూల్డ్ ట్రైబ్స్) 16%
- BC (బ్యాక్‌వర్డ్ క్లాసెస్) 25%
- మహిళలు 10% |
- మిగిలినవి ఓపెన్ కేటగిరీలో ఉంటాయి.
దుకాణాల నిర్వహణలో నిబంధనలు
కొత్త పాలసీలో మద్యం విక్రయదారులు పాటించాల్సిన ముఖ్య నిబంధనలను ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు, దేవాలయాలు, ఆస్పత్రుల నుంచి కనీసం 100 మీటర్ల దూరంలో షాపులు ఉండాలి. లైసెన్స్ హోల్డర్లు మద్యం విక్రయం కోసం నిర్ణయించిన సమయాలకే పరిమితం కావాలి. మైనర్లకు (18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి) మద్యం విక్రయం నిషేధం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే లైసెన్స్ రద్దు చేస్తారు. జరిమానాలు విధిస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    