ACB Raids | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 40 వేల డిమాండ్ చేశారనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీడియో, ఆడియోటేపుల ఆధారంగా ఎస్ఐ రంజిత్ ను పక్కా ప్లాన్ వేసి పట్టుకున్నారు. సుమారు మూడు గంటలపాటు విచారించిన అధికారులు.. రంజిత్ లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించారు. ఎస్ ఐ రంజిత్ పై కేసు నమోదు చేశారు.
ఈ కేసు వివరాలను ఖమ్మం ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వారి వద్ద నుంచి రూ.40వేలు ఎస్సై రంజిత్ డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు పక్కాగా వల పన్ని ఎస్ఐని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఈ సంఘటనతో మణుగూరులో కలకలం రేగింది. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి చర్యలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    