Israeli Hacking software : తెలంగాణ ప్రభుత్వం (Telangana Governament) తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం పెద్ద చర్చకు దారి తీసింది. సైబర్ నేరాల దర్యాప్తులను వేగవంతం చేయలనే ఉద్దేశంతో ఇజ్రాయెలీ కంపెనీ వద్ద ఓ సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు సర్కారు సిద్ధమవుతోంది. ఈ సాఫ్ట్‌వేర్ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాల్లోకి చొరబడి హ్యాక్ చేయగలదు. తద్వారా నేరాలకు సంబంధించి పోలీసులు (police department) ఆధారాలను త్వరితగతిన తెలుసుకునేందుకు సులభతరం అవుతుంది. అయితే.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఇది కలకలం రేపుతోంది. ఇది నేరాలు జరిగినప్పుడే మాత్రమే ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తామని ప్రభుత్వం చెబుతున్నాదీనిని దుర్వినియోగం చేసే అవకాశాలు లేకపోలేదని విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఓటర్ డేటా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana State) తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? అనే విషయంపై చర్చ కొనసాగుతోంది.
Israeli Hacking software : పరికరాల్లోకి చొరబాటు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Telangana State Cyber Security Bureau (TGCBS) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ఖరారు చేసింది. ఇజ్రాయెలీ కంపెనీ తయారు చేసిన ‘brute force’ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెడుతోంది. మొబైల్, ఇతర డివైజ్‌లలో చొరబడేందుకు ఇది ఉపయోగపడుతుంది. వినియోగదారులు లాక్ చేసిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాబ్ లాంటి తదిర డివైజ్‌లను అన్‌లాక్ చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్‌లోని ‘Cellbrite’ అనే టూల్ (hacking tool)ను ఉపయోగపడుంది. పాస్‌వర్డ్ లేకపోయినా ఈ టూల్ ఆ పరికరాన్ని సులభంగా అన్‌లాక్ చేయగలరు. తద్వారా ఆ డివైజ్‌లలోని సమాచారాన్నిసేకరించొచ్చు. ఫోన్, ఇతర డివైజ్ యజమాని పాస్‌వర్డ్ ఇవ్వకపోయినా పోలీసులు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈజీగా కనుగోవచ్చు.
సైబర్ నిపుణుడు శ్రీనివాస్ కొడాలి ఈ విషయంపై మాట్లాడుతూ ‘ప్రభుత్వాలు ఇలాంటి టూల్స్‌ను నేరుగా విదేశీ కంపెనీల నుంచి కొనలేవు. అందుకే.. సరఫరాదారుల ద్వారా టెండర్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రజలు పాస్‌వర్డ్ ఇవ్వకపోతే పోలీసులు Cellbriteను ఉపయోగించి అందులోకి చొరబడతారు’ అని తెలిపారు.
ఐఫోన్లను హ్యాక్ చేయలేదట!
ఈ Cellbrite కొత్త మోడల్ iPhonesను హ్యాక్ చేయలేకపోతుందని తెలుస్తోంది. కానీ మార్కెట్లో ఉన్న ఎక్కువ ఫోన్లలోకి చొరబడగలదని నిపుణులు అంటున్నారు. Google Pixel వంటి ఫోన్లలో సెక్యూరిటీ హార్డ్‌వేర్ బలంగా ఉంటుంది. అందుకే BRS నేత కవిత iPhoneను Enforcement Directorate కూడా హ్యాక్ చేయలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు.
ఇంకా ప్రభుత్వం ఏమంటోందంటే…
తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (TTSL) ఈ సాఫ్ట్‌వేర్ కోసం TSCSB ద్వారా టెండర్‌ను ఆహ్వానించింది. సైబర్ నేరాల దర్యాప్తును ఆధునిక సాంకేతికతతో మరింత బలపరచడం ఈ టెండర్ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం అంటోంది. నేరాలు జరిగినప్పుడు ఆధారాలను సేకరించడంలో ఈ సాఫ్ట్‌వేర్ సమర్థంగా పనిచేస్తుందని, తద్వారా కేసుల పరిశీలనను వేగవంతం చేయొచ్చని చెబుతోంది. AI ఆధారిత ఆటోమేషన్ ద్వారా ఈ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుందని అంటోంది
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    