23 మంది మహిళా మావోయిస్టులు సహా 103 మంది మావోయిస్టుల లొంగుబాటు
Chhattisgarh Naxal News : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు (Maoists ) ఉద్యమంపై భద్రతా దళాలు మరో కీలక విజయం సాధించాయి. శుక్రవారం 103 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో 23 మంది మహిళలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఛత్తీస్‌గఢ్ అభయారణ్యం మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. కానీ ఇటీవల భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టిన యాక్షన్ ప్లాన్, అవగాహన కార్యక్రమాలు, పునరావాస పథకాలు మావోయిస్టుల ఆలోచనల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో నక్సలైట్లు లొంగిపోతున్నారు.
లొంగిపోయిన 103 మంది మావోయిస్టుల్లో 49 మందిపై రూ.1.06 కోట్లకు పైగా రివార్డు ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి, భద్రతా దళాలకు పెద్ద విజయంగా చెప్పవచ్చు.లొంగుబాటుతోపాటు పునరావాసం, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ రూ. 50,000 చొప్పున ప్రోత్సాహక నగదు పంపిణీ చేసింది. ఆర్థిక సాయంతోపాటు వృత్తి శిక్షణ, నివాసం, విద్య వంటి సౌకర్యాలు కూడా ఈ పథకంలో అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ‘ఆపరేషన్ కగార్ (Operation Kagar)’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని అంతం చేయాలని దూకూడుగా వెళుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా సరిహద్దు అడవులలో భద్రతా దళాలు మోహరింపులు పెంచి, మావోయిస్టులకు ఆర్థిక, లాజిస్టిక్ మద్దతును అడ్డుకుంటున్నాయి. అదే సమయంలో పునరావాసం, సామాజిక న్యాయం, అభివృద్ధి అనే మూడు సూత్రాలపై రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయడం వల్లే బీజాపూర్‌లోని ఈ లొంగుబాటు సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    