జీటో కనెక్ట్ 2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
Hyderabad : విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్‌గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని, దేశానికి రోల్ మోడల్‌గా అవతరించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్ (Hyderabad itex), హెచ్‌ఐసీసీ లో మూడు రోజులపాటు జరుగుతున్న ‘జీటో కనెక్ట్ 2025’ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధ్ బాబు మాట్లాడుతూ, “ఇప్పటి పారిశ్రామికవేత్తలు కేవలం రాయితీలు, ప్రోత్సాహకాలు కాకుండా నైతికత, సమ్మిళితత, సుస్థిరతను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తునే తెలంగాణ నిర్మిస్తోంది. అవకాశాల ఖనిగా తెలంగాణ పరిశ్రమల పెట్టుబడులకు అత్యంత అనుకూలం,” అని అన్నారు. జైన సమాజం సేవా స్ఫూర్తిని తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానిస్తే ప్రపంచానికి కావలసిన నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతమవుతుందని తెలిపారు. నిజమైన యూనికార్న్ అంటే బిలియన్ డాలర్ల విలువ కాదని, లక్షలాది జీవితాలను ప్రభావితం చేయడమేనని యువ పారిశ్రామికవేత్తలకు సూచించారు.
కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, జీటో హైదరాబాద్ ఛాప్టర్ ప్రతినిధులు రోహిత్ కొఠారి, లలిత్ చోప్రా, విశాల్ అంచాలియా, బీఎల్ భండారీ, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    