ఒకప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) రూటే సపరేటు. విలన్ గా చాలా మంది వచ్చినా మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్, ఏ ఎన్ఆర్, చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాల లో కూడా విలన్ గా పోటా పోటీగా మెప్పించాడు. నెగిటివ్ రోల్ లో క్రూరంగా యాక్ట్ చేసి అదరగొట్టారు. ఆ తర్వాత హీరోగా మారి కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు.
ప్రొడ్యూసర్ గా మారి సూపర్ హిట్స్ అందించాడు.
రెండున్నర దశాబ్దాల క్రితం మోహన్ బాబు రేంజ్ వేరు. ఆయన నుండి మూవీ వస్తుందంటే ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేసేవారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన బుజ్జిగాడు లో కూడా పవర్ ఫుల్ గా యాక్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆయన రేంజ్ కు తగ్గట్టుగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు.
పవర్ ఫుల్ మూవీతో కంబ్యాక్..
చాలా కాలం తర్వాత ఒక పవర్ ఫుల్ మూవీ తో కంబ్యాక్ ఇస్తున్నారు. నాచురల్ స్టార్ నాని(natural Star Nani)తో దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల(Srikanth odela)కాంబోలో వస్తున్న ప్యారడైజ్ (paradise)మూవీలో విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో శికంజ మాలిక్ (shikanja malik)రోల్ లో భయపెట్టబోతున్నారు. రీసెంట్ గా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
వింటేజ్ లుక్ లో కలెక్షన్ కింగ్..
మూవీ టీం రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ లో రగ్గడ్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సెకండ్ పోస్టర్ లో మోహన్ బాబు టక్ చేసుకుని గన్ను పట్టుకోవడం.. వింటేజ్ కలెక్షన్ కింగ్ ను గుర్తు చేశారు. శికంజ మాలిక్ గా తన యాక్టింగ్ అదిరిపోతుంది మూవీ టీం చెబుతోంది. ఇక ఈ మూవీ రిలీజ్ తర్వాత మోహన్ బాబు మళ్లీ విలన్ గా బిజీ కానున్నాడని టాక్ వినబడుతోంది.
Mohan Babu : వరుస సినిమాల్లో బిజీ..?
హీరో జగపతి బాబుకు కూడా సినిమాలు తగ్గినప్పుడు బోయపాటి లెజెండ్ మూవీతో విలన్ గా మారాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు తనకు డైరెక్టర్స్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లు రాస్తూనే ఉన్నారు. వరుస సినిమాల తో బిజీ బిజీ గా ఉన్నారు. మోహన్ బాబు కూడా మళ్ళీ విలన్ గా యాక్ట్ చేయడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ కి ఒక పవర్ ఫుల్ విలన్ దొరికినట్టే. పెద్ద సినిమాల్లో మోహన్ బాబు విలనిజాన్ని మళ్ళీ చూడొచ్చని సినీ లవర్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల్లో శికంజ మాలిక్ గా మోహన్ బాబు ను థియేటర్లో చూడొచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








