Nizamabad | రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పన్నులు విధించుడు తప్పన ఇంకేమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) విమర్శించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ భూముల ధరలు పడిపోయాయని తెలిపారు. బీర్ల ధరలు, విస్కీ ధరలు పెంచించారని తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చి మొగోళ్లకు డబల్ టికెట్ కొడుతున్నారని తెలిపారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను బంద్ చేశాడు.నూట్రిషన్ కిట్టు బందు.. కేసీఆర్ కిట్టు బందు.. బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయని మండిపడ్డారు. కేసీఆర్ ఉండంగా ఎట్ల ఇచ్చిండు.. రేవంత్ రెడ్డి ఎందుకు బంద్ చేసిండు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిది కేవలం దోచుకునే ప్రభుత్వమని విమర్శించారు.
మల్ల ఎటు చూసినా కేసీఆర్ (KCR) రావాలనే గాలి మొదలైందని హరీశ్‌రావు తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ప్యాకేజి తెస్తా ప్యాకేజీ తెస్తా అన్నాడు.. రేవంత్ రెడ్డి వచ్చి ప్యాకేజ్ ఇస్తా అన్నాడు అని తెలిపారు. వరదలు వచ్చి రోజులు దాటినా ఒక్క రూపాయి అయినా రేవంత్ రెడ్డి ఇచ్చాడా అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామన్నారని.. ఒక రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తొందర్లో కాంగ్రెస్ బాకీ కార్డులు కూడా నియోజకవర్గానికి వస్తాయన్నారు. ప్రతి ఇంటికి బాకీ కార్డులను చేర్చాలని సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    