Indian Railways Bharat Gaurav Train | విశాఖపట్నం: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) ఈ సంవత్సరం రెండు ప్రత్యేక ఆధ్యాత్మిక సర్క్యూట్‌లను ప్రకటించింది. టూర్ టైమ్స్ నిర్వహిస్తున్న సౌత్ స్టార్ రైల్ ద్వారా భక్తులు భారత్‌లోని పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకునే అరుదైన అవకాశం కల్పిస్తోంది.
మొదటి యాత్రా సర్క్యూట్ నవంబర్ 16న ప్రారంభమై 11 రోజులపాటు తమిళనాడు, కేరళలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుంది. ఇందులో ప్రదోషం రోజున నటరాజ స్వామి, మాసిక్ శివరాత్రి రోజున అరుణాచలేశ్వర స్వామి దర్శనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు..
టికెట్ ధరలు రూ. 19,950 (2SL) నుంచి రూ. 42,950 (1AC) వరకు ఉన్నాయి.
రెండో యాత్ర నవంబర్ 26న ప్రారంభమవుతుంది. ఇది 10 రోజుల పాటు సాగి పంచ ద్వారక యాత్రను కవర్ చేస్తుంది. ఇందులో నిష్కలంక్ మహాదేవ్ సముద్ర ఆలయం, జ్యోతిర్లింగ దర్శనాలు ఉంటాయి. మోక్షద ఏకాదశి నాడు ద్వారకాధీశ్ దేవాలయంలో ప్రత్యేక దర్శనం ఈ యాత్రలో ప్రధాన భాగం. టిక్కెట్ ఛార్జీలు రూ. 41,150 నుంచి రూ. 63,000 వరకు ఉంటాయి.
టూర్ టైమ్స్, పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అగ్రశ్రేణి ఆపరేటర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 21,130 మంది యాత్రికులను 242,993 రైలు కిలోమీటర్లలో విజయవంతంగా రవాణా చేసింది.
ఈ యాత్రలో భాగంగా ప్రయాణీకులు 33% రైల్వే సబ్సిడీ, దక్షిణ భారతీయ భోజనం, ఆన్‌బోర్డ్ వినోదం, భద్రతా సౌకర్యాలు, మరియు LTC/LFC ప్రయోజనాలు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల నుండి 650 సీట్ల సామర్థ్యంతో రైలు బయలుదేరనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    