Hyderabad : తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన క్రమంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అల్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మాటల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని.. లేని పక్షంలో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదముందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం Hyderabad నార్సింగి (Narsingi)లోని ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి మంత్రులు అడ్లూరితో పాటు పొన్నంను ఆహ్వానించారు. మరోవైపు పొన్నం తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి అడ్లూరి పట్టుబడుతుండగా.. తాను ఆ మాటలను అడ్లూరిని అనలేదని పొన్నం చెబుతున్నారు. మరోవైపు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ మంత్రుల వివాదంపై ఆరా తీసినట్లు సమాచారం.
పొన్నం నివాసం వద్ద భద్రత
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman)పై సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కాకరేపుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి అడ్లూరి ఓ వీడియోను సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో తాము పొన్నం నుంచి సమాధానం ఆశిస్తున్నామని అన్నారు. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు అవుతాడని మంత్రి అడ్లూరి చెప్పారు. దీంతో మాదిగ సామాజికవర్గానికి చెందిన తమ నేతను అవమానిస్తారా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కరీంనగర్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ఎదుట భారీ భద్రత ఏర్పాటు చేశారు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    