హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో కొద్దిరోజుల క్రితం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం మరువక ముందే.. కాంగ్రెస్ మంత్రుల మధ్య మరో పంచాయితీ మొదలైంది. వరంగల్‌లోని మేడారం జాతర అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కి అలాగే ఆ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ (Konda Surekha)కు మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్ రాజకీయాలతోపాటు దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి అనవసరంగా జోక్యం చేసుకుంటు న్నారని కొండా దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఈ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు చేశారు. పొంగులేటి తన సొంత కంపెనీకి టెండర్లు ఖరారు చేయించుకున్నారని ఆరోపించారు. ఆయన వల్ల జిల్లాలో తాము ఇబ్బంది పడుతున్నామని వెల్లడించారు.
అయితే తాజా వివాదంపై రాష్ట్రానికి చెందిన పార్టీ పెద్దలు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని కొండా దంపతులు పేర్కొన్నారు. కాగా, ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.
దేవాదాయ శాఖకు సంబంధించిన రూ.71 కోట్ల పనుల టెండర్ తనకు తెలియకుండానే రావడంపై మంత్రి సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయమై సురేఖ ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై దిల్లీ వెళ్లి ఖర్గేను కలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    