Hyderabad | ఇటీవల తనపై జరుగుతున్న పరిణామాలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మరోసారి స్పందించారు. పార్టీ పెద్దలతో సమావేశమైన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి నాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత చర్చించారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను వివరించారు. బుధవారం రాత్రి తన ఇంటి వద్దకు పోలీసులు వచ్చిన సమయంలో జరిగిన విషయాలను వారికి వివరించారు. భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. తన సమస్య పరిష్కరించేం దుకు ప్రయత్నిస్తామని వారు హామీ ఇచ్చారు. మిగిలిన విషయాలు వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నానని మంత్రి సురేఖ వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని నేతలకు వివరించినట్లు తెలిసింది. డెక్కన్ సిమెంట్ యాజమాన్యం వ్యవహారంలో జరిగిన పరిణామాలు, వారితో జరిగిన చర్చలు, ఆ సంస్థ అక్రమాలు తదితర విషయాలన్నీ వివరించినట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్‌ని తాను గురువారం కలిశానని మంత్రి సురేఖ చెప్పారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా తాను సరే పాటిస్తానని స్పష్టం చేశారు. తన ఆలోచనలు, ఇబ్బందులని కాంగ్రెస్ పెద్దలకు చెప్పానని వివరించారు.
పార్టీ పెద్దలు కూర్చొని మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హా ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. 
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    