Nizamabad | తెలంగాణలో సంచలనం సృష్టించినకానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ (Sheikh Riaz) మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) పై కత్తితో దారుణంగా దాడిచేసి చేసిన రియాజ్.. అక్కడి నుంచి పారిపోయాడు.ఈ దాడిలో కానిస్టేబుల్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంతరం రియాజ్‌ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రౌడీ షీటర్ రియాజ్ (Riyaz) ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోతుండగా రియాజ్‌ను పట్టుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి రియాజ్ దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి.
అనంతరం పోలీసులు రియాజ్‌ను అదుపులోకి తీసుకొని స్థానిక హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. కాగా సోమవారం చికిత్స సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ గన్ లాక్కొని పారిపోయేందుకు రియాజ్ యత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. రియాజ్ జరిపిన కాల్పుల్లో ఏఆర్ కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    