ACB Raid in Mancherial | మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు(ACB Raid) చేసి ఓ అవినీతి తిమింగళాన్ని పక్కా ప్లాన్‌తో పట్టుకున్నారు.. శనివారం మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ పట్టణంలోని తన నివాసం వద్ద రూ.2 లక్షల లంచం(Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఏసీబీ ఆదిలాబాద్ ఏఎస్పీ మధు( ASP Madhu ) కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ సహకార జిల్లా ఇన్‌చార్జి అధికారిగా పని చేస్తున్న సమయంలో అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి గతేడాది నవంబరులో సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే సదరు ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు, సస్పెండ్ ఎత్తివేయడం కోసం ఏకంగా రూ.7 లక్షలను లంచంగా డిమాండ్ చేశాడు.
ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. 2 లక్షల ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో విచారణ చేపట్టారు.
లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    