హైదరాబాద్, సర్కార్లైవ్ : మొంథా తుపాను (Montha Cyclone) ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, పాలమూరు జిల్లా వ్యాప్తంగా వానలు విజృంభిస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద దుందుభి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కల్వకుర్తి – నాగర్కర్నూల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. చెట్లు నేలమట్టమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. మరో వైపు పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో 23 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    