Karthika Pournami 2025 | కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, వరంగల్‌లోని కట్టమల్లన్నదేవాలయం, కోటిలింగాల దేవాలయం, ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం, ములుగు జిల్లా రామప్ప, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, హనుమకొండలోని సిద్దేశ్వరాలయం, కోటగుళ్లు, పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు. మహదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.
పుణ్యస్నానాలు, దీపోత్సవాలు
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కాళేశ్వరం వద్ద గోదావరి త్రివేణి సంగమంలో పెద్ద సంఖ్యలో మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే భద్రాచలం వద్ద గోదావరి ఘాట్‌ల వద్ద భక్తులు స్నానాలు చేసి, ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా దేవాలయాల పరిసరాలు “ఓం నమఃశివాయ” నినాదాలతో మార్మోగాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








