Pushpa 2 Movie Review And Rating | ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పుష్ప – 2 ది రైజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ఎర్రచంద్రనం స్మగ్లర్ పుష్ప రాజ్ (Allu Arjun) తన వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని శక్తిగా ఎలా ఎదిగాడు.. అనే విషయాలను చూపుతుంది. అల్లు అర్జున్ మాస్ జాతర పార్ట్‌లో మరింత పీక్ చేరింది. సుకుమార్ తన రచనా నైపుణ్యంతో సినిమాకు ప్రాణం పోశాడు.
అండర్ డాగ్ రెడ్ సాండర్స్ పుష్ప ఎలా అధికారంలోకి వచ్చాడనే దాని గురించి పుష్ప: ది రైజ్ లో చూడగా, పార్ట్ 2 ది రూల్ అతను తన శక్తిని ప్రభావాన్ని ఉపయోగించి జీవితాన్ని ఎలా నావిగేట్ చేసాడో చూపిస్తుంది. ది రూల్‌లో అల్లు అర్జున్ నటన, పుష్ప రాజ్‌గా తన యాటిట్యూడ్‌ని క్యారీ చేసే విధానం అద్భుతంగా ఉంది. ఈ చిత్రం కూడా త్వరగా ప్రధాన కథాంశంలోకి తీసుకెళ్తుంది. అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ మధ్య ఆధిపత్యం కోసం యుద్ధం ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య సవాల్, ప్రతిసవాల్ ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌కు సంబంధించిన విషయాలను చక్కగా సెట్ చేస్తుంది.
కథ గురించి..
ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌కు తిరుగులేని శక్తిగా ఎదిగిన పుష్ప రాజ్ (అల్లు అర్జున్) భార్య శ్రీవల్లి (Rashmika Mandanna)తో కలసి హాయిగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అయితే ఒక రోజు తన గ్రామంలోకి ముఖ్యమంత్రి పర్యటనకు వస్తాడు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్తున్న పుష్పని ఆయనతో ఒక ఫొటో తీసుకోవాలని శ్రీవల్లి కోరుతుంది. ఈ క్రమంలో అక్కడ పుష్పరాజ్ ను తీవ్రంగా అవమానిస్తారు. ఒక స్మగ్లర్‌తో ఫొటో దిగడమా? అని ముఖ్యమంత్రి ఇన్‌సల్ట్ చేయడంతో ఈగో హర్ట్ అయిన పుష్పరాజ్ ఏకంగా సీఎంను పదవి నుంచి తప్పించాలని బలంగా డిసైడైపోతాడు. అందుకోసం ఎన్నో వ్యూహాలు పన్నుతాడు. అలాగే సీఎంపై ప్రతీకారం తీర్చుకునేందుకు పుష్పరాజ్ ఎలాంటి ప్లాన్లు వేశాడు. అవి వర్కౌట్ అయ్యాయా; ఇంతలో పుష్పరాజ్ వ్యూహాలను పోలీస్ ఆఫీసర్ షెకావత్ (ఫాహాద్ ఫాజిల్) ఎలా అడ్డుకున్నాడు? అనేది ఇక్కడ ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. మరోవైపు బాల్యం నుంచి తన ఇంటి పేరు కోసం పోరాడుతున్న పుష్పకి చివరకు ఆ పేరు దక్కిందా? అనేది తెరపై చూడాల్సిందే…Pushpa 2 Movie Review
కథా విశ్లేషణ
ఒకసాధారణ కూలీ నుంచి స్మగ్లింగ్ సిండికేట్‌కు డాన్ గా పుష్పరాజ్ ప్రయాణాన్ని పుష్ప ది రైజ్‌లో చూపించగా పార్ట్ 2 ది రూల్ లో సిండికేట్‌కు డాన్ అయ్యాక పుష్పరాజ్ ప్రభావం ఎలా సాగిందనే అంశాన్ని చూపించారు. జపాన్ పోర్ట్ యాక్షన్ సీక్వెన్స్‌తో కథ మొదలువుతుంది. మాస్ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తూ పుష్ప తెరపైకి రావడం చాలా క్రేజ్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా హీరో రైజ్ పై దృష్టి సారిస్తూనే మరోవైపు హీరోయిజాన్ని హైలట్ చేస్తూ సాగుతోంది. సీఎం ఫోటో ఎపిసోడ్ ఈ మూవీకి కీలక మలుపు.
సినిమా మొత్తం డ్రామా ఎక్కడా విసుగు అనిపించకుండా ఇన్ ట్రెస్ట్‌గా అనిపిస్తుంది. ఇందులో అల్లు అర్జున్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తోపాటు పుష్పరాజ్ క్యారెక్టర్‌ని అల్లుకున్నతీరు బాగా సెట్ అయింది. పుష్పరాజ్, పోలీస్ ఆఫీసర్ షెఖావత్ పాత్రల మధ్య వొచ్చే సవాల్ సెకండ్ హాఫ్‌పై ఉత్కంఠ పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ చేజ్ సీక్వెన్స్‌తో మొదవుతుంది. ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్‌తో పుష్ప ఇచ్చే ట్విస్ట్‌లు పీక్ చేరుతాయి. ఇక జాతర ఎపిసోడ్ మొత్తం సినిమాకే హైలైట్గా. ఇందులో యాక్షన్, డ్యాన్స్ అభిమానులకు పంచభక్త భోజనంలా ఉంటుంది.
2 Comments
[…] ఈటీవీ జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన కమెడియన్లలో ఆటో రామ్ ప్రసాద్ […]
[…] పుష్ప: ది రూల్ భారతీయ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రికార్డులను బద్దలు కొట్టింది. SS రాజమౌళి తీసిన RRRని అధిగమించి, ఏ భారతీయ సినిమాకైనా గొప్ప ఓపెనింగ్గా నిలిచింది. ఇది అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్‌ను అధిగమించి బాలివుడ్ అత్యధిక ఓపెనింగ్స్‌గా రికార్డ్‌ను కూడా తిరగరాసింది. […]