Pushpa -2 | సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్పా 2 మూవీ మరికొద్దిరోజుల్లోనే విడుదల కాబోతుంది. స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” హీరోగా నేషనల్ క్రష్ “రష్మికా మందన” హీరోయిన్ గా నటించిన “పుష్పా’ మూవీని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఆ మూవీ జాతీయ స్థాయిలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన విషయం సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అయితే ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న “పుష్పా-2” పై ఇప్పుడు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల క్రితం విడుదలైన “పుష్పా” సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను సృష్టించి అల్లుఅర్జున్ స్థాయిని అమాంతం పెంచినట్లు చెప్పవచ్చు.
అదే ఊపుతో పుష్పా-2 మూవీని దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కించి జాతీయ స్థాయిలో పుష్ప-2 మూవీని నెంబర్ వన్ పాన్ ఇండియా మూవీగా నిలబెట్టాలని చూస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. పుష్పా మూవీ రన్ టైం 2 గంటల 59 నిమిషాలు ఉండగా “పుష్పా -2” మూవీ రన్ టైం 3 గంటల 15 నిమిషాలు ఉండనున్నట్లు ప్రచారం జరగడంతో రన్ టైం పెరగడం ఈ మూవీకి లాభమా? నష్టమా? అనే టెన్షన్ సగటు సినీ ప్రేక్షకులతోపాటు, బన్నీ అభిమానులను సైతం కలవరపెడుతున్నట్లు ప్రచారం.
One thought on “Pushpa -2 | పుష్ప – 2 ” రన్ టైమ్ మరీ ఓవర్..!!?”