Jabardasth Comedian Ram Prasad : జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గురువారం ఓ షూటింగ్‌కి వెళుతున్న రాంప్రసాద్ కారు ప్రమాదానికి గురైనట్టు సమాచారం. ఈ ఘటనలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. రోజుమాదిరిగానే గురువారం రాంప్రసాద్ కారులో షూటింగ్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో హైదరాబాద్ తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్ కారు ముందుకు కారును ఢీకొట్టింది.
కాగా రాంప్రసాద్ ముందు వెళుతున్న కారు ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన రాంప్రసాద్ కారు ముందు భాగంగా నుజ్జునుజ్జు అయ్యింది. అయితే ఈ ప్రమాదం నుంచి త్రటిలో తప్పించుకున్న రాంప్రసాద్ చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే రాంప్రసాద్‌కు ప్రమాదం జరిగినట్టు తెలిసి అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈటీవీ జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన కమెడియన్లలో ఆటో రామ్ ప్రసాద్ ఒకరు. తన ప్రత్యేకమైన పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు స్టార్ కమెడియన్ ఆటో రాంప్రసాద్.. సుడిగాలి సుధీర్, గెటప్ శీనుల రాం ప్రసాద్ లు కలిశారంటే ఇక పంచులకు పుల్‌స్టాప్ ఉండదు..వీరు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సుధీర్, గెటప్ శీను జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయినప్పటి నుంచి టీమ్ లీడర్ గా రాం ప్రసాద్ కొనసాగుతున్నాడు.