Sarkar Live

AAP Candidate List | న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌, కాల్కాజీ నుంచి అతిషి

AAP Candidate List all updates : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ముంద‌స్తు చ‌ర్య‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మ‌రింత వేగం పెంచింది. త్వరలోనే ఎన్నికల సంఘం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల

AAP Candidate List

AAP Candidate List all updates : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ముంద‌స్తు చ‌ర్య‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మ‌రింత వేగం పెంచింది. త్వరలోనే ఎన్నికల సంఘం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల తేదీలను ప్రకటించనున్న నేప‌థ్యంలో త‌మ అభ్య‌ర్థుల నాలుగో జాబితాను విడుద‌ల చేసింది. 70 స్థానాల్లో 38 స్థానాల‌కు అభ్య‌ర్థుల పేర్ల‌ను ఆప్ ప్ర‌క‌టించింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కొత్త ఢిల్లీ నుంచి పోటీ చేయ‌నున్నారు. కాల్కాజీ నుంచి ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి అతిషి మార్లెనా సింగ్ పోటీ చేస్తారు.

ముఖ్య స్థానాల నుంచి ప్రముఖ అభ్యర్థులు

ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి శకూర్ బస్తీ నుంచి సత్యేందర్ జైన్‌ను రంగంలోకి దింపింది. మాల్వియా నగర్ నుంచి సోమనాథ్ భారతి, గ్రేటర్ కాలాశ్ నుంచి సౌరభ్ భరద్వాజ్, బాబర్‌పూర్ నుంచి గోపాల్ రాయ్ పోటీ చేస్తున్నారు. కస్తూర్బా నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రమేశ్ ప‌హ‌ల్వాన్ పోటీ చేయ‌నున్నారు. ప్రస్తుతం అక్కడి ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ ఇవ్వలేదు. ఉత్తమ్ నగర్ నుంచి నరేష్ బాల్యాన్ భార్య పూజ నరేష్ బాల్యాన్ టికెట్ పొందారు. నరేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

AAP Candidate List ఇంకెవ‌రు ఉన్నారంటే…

బవానా నుంచి జైభగవాన్, బడ్లీ నుంచి అజయ్ యాదవ్, త్రినగర్ నుంచి ప్రీతీ తోమర్, సుల్తాన్‌పూర్ మజ్రా నుంచి ముఖేష్ కుమార్ అహ్లావత్, నాంగ్లోయ్ జాట్ నుంచి రఘువీందర్ షౌకీన్, వజీర్‌పూర్ నుంచి రాజేశ్ గుప్తా, షాలిమార్ బాగ్ నుంచి వందనా కుమారి, మోడల్ టౌన్ నుంచి అఖిలేష్ పతీ త్రిపాఠీ, బల్లిమారన్ నుంచి ఇమ్రాన్ షౌకీన్, సదర్ బజార్ నుంచి సౌం దత్, కరోల్ బాగ్ నుంచి విశేష్ రవి, మోతీనగర్ నుంచి శివచరణ్ గోయెల్, గోకుల్‌పూర్ నుంచి సురేంద్ర కుమార్ పోటీ చేయనున్నారు.

పూర్తి న‌మ్మ‌కంతో పోటీ చేయ‌నున్నాం: కేజ్రీవాల్

త‌మ పార్టీ మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింద‌ని, పూర్తి నమ్మకం, సమగ్ర ప్రణాళికలతో తాము ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నామ‌ని అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) తెలిపారు. బీజేపీకి నాయకత్వం లేదని, ప్రణాళిక కూడా లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అభివృద్ధిపై ఆ పార్టీకి ప్రత్యేక దృష్టికోణం లేద‌ని అన్నారు. కేజ్రీవాల్‌ను తొలగించాల‌నే ఏకైక నినాదంతో మాత్ర‌మే వారు ఎన్నిక‌ల్లో పోటీచేయ‌నున్నార‌ని విమ‌ర్శించారు. ఐదేళ్ల‌లో ఏం చేశార‌ని ప్ర‌జ‌లు అడిగితే కేజ్రీవాల్‌ను విమ‌ర్శించామ‌ని చెప్ప‌డం క‌న్నా మ‌రోక‌టి లేద‌ని వ్యాఖ్యానించారు. త‌మ పార్టీకి అభివృద్ధి పట్ల స్పష్టమైన దృష్టి, ప్రణాళిక ఉంద‌న్నారు. దీన్ని అమలు చేసేందుకు విద్యావంతుల బృందం త‌మ వ‌ద్ద ఉంద‌న్నారు. దశాబ్దకాలంలో చేసిన పనుల జాబితా సుదీర్ఘంగా ఉంద‌న్నారు. ఢిల్లీ ప్రజలు పని చేసేవారికే ఓటు వేస్తార‌ని, విమర్శించేవారికి కాద‌ని అన్నారు.

ముందుగానే ప్రకటించిన జాబితా

మునుపు విడుదల చేసిన మూడో జాబితాలో నజఫ్గఢ్ నుంచి తరుణ్ యాదవ్‌కు టికెట్ ఇచ్చారు. సామాజిక కార్యకర్త అయిన తరుణ్ తన కార్పొరేటర్ భార్యతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. జంగ్‌పూరా నుంచి సీనియర్ నేత మనీష్ సిసోడియా పోటీ చేస్తున్నారు. పట్పర్గంజ్ నియోజకవర్గంలో మాన్య నుంచి ప్ర‌ముఖ అధ్యాప‌కుడు అవధ్ ఓజా పోటీ చేయనున్నారు. షాహదరా నుంచి జితేంద్ర్ సింగ్ శంటీ పోటీ చేస్తున్నారు.

ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పటిష్టమైన అభ్యర్థులతో ఎన్నికల సమరానికి సన్నద్ధమైంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?