Abortion in Telangana : తెలంగాణలో పెరుగుతున్న అబార్షన్ల (abortions) సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 2024-25లో రాష్ట్రంలో మొత్తం 16,059 అబార్షన్లు నమోదయ్యాయి. 2020-21లో ఉన్న గణాంకాలతో పోలిస్తే ఇది పది రెట్లు పెరుగుదల అని ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూడా అబార్షన్ల (abortions) సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. 2020-21లో కేవలం 2,282 కేసులు ఉండగా, 2024-25లో ఈ సంఖ్య 10,676కు చేరింది. ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పార్లమెంట్‌లోని వర్షాకాల సమావేశం ( Parliament’s monsoon session)లో వెల్లడించింది.
అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాలు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) డేటా ప్రకారం 2024-25లో అత్యధికంగా అబార్షన్లు జరిగిన రాష్ట్రాలు ఇవి:
- మహారాష్ట్ర : 2,07,019
- తమిళనాడు : 1,01,414
- అస్సాం : 76,642
- కర్ణాటక : 70,2415. రాజస్థాన్ : 53,714
 మహారాష్ట్రలో అత్యధిక కేసులు ఉండగా తెలంగాణ (Telangana)లోనూ అబార్షన్ల (abortions) సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిస్తున్నాయి.
Abortion : అబార్షన్ల పెరుగుదలకు కారణాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం అబార్షన్ల పెరుగుదల వెనుక పలు కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా అనవసర గర్భధారణలు, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన లేకపోవడం, లైంగిక ఆరోగ్యంపై తగిన అవగాహన లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకవడం అని తెలుస్తోంది.
మైనర్‌కు గర్భస్రావం.. హైకోర్టు తిరస్కరణ
హైదరాబాద్‌లోని ఎస్.ఆర్. నగర్‌కు చెందిన ఓ బాలికకు అబార్షన్ (abortions) కు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్ట ప్రకారం కమిటీ ఏర్పాటు చేసి గర్భస్రావం చేసేందుకు కోర్టు ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ నాగేశ్ భీమాపాక్ విచారించారు. మెడికల్ బోర్డు నుంచి నివేదిక కోరారు. మెడికల్ నివేదికలో ఆ బాలిక 28 వారాల వయసు గల కవల గర్భాన్ని మోస్తోందని, ఈ దశలో గర్భస్రావం చేయడం తల్లీబిడ్డలకు ప్రాణహానికరమని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైకోర్టు గర్భస్రావానికి అనుమతి ఇవ్వలేదు.
చట్టం ఏం చెబుతోంది?
భారతదేశంలో గర్భస్రావం చేయించుకొనేందుకు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (Medically Terminated Pregnancies-MTP Act) కింద అనుమతి ఉంటుంది. 2021 సవరణ ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో గర్భస్రావం గరిష్టంగా 24 వారాల వరకు పర్మిషన్ ఉంటుంది. దానిని మించితే కేవలం తల్లి ప్రాణ రక్షణ లేదా తీవ్రమైన వైద్య సమస్యల సందర్భాల్లోనే అనుమతి లభిస్తుంది. మైనర్ల విషయంలో తల్లిదండ్రుల అనుమతి, కోర్టు ఆదేశం అవసరం అవుతుంది.
సామాజిక అంశాలు కొన్ని..
పెరుగుతున్న అబార్షన్ల సంఖ్య కేవలం వైద్య గణాంకం మాత్రమే కాకుండా సామాజిక అంశంగా కూడా మారాయి. అనవసర గర్భధారణల పెరుగుదల, లైంగిక విద్య లోపం, వివాహేతర సంబంధాల కారణంగా వచ్చే మానసిక ఒత్తిడి.. ఇవన్నీ గర్భస్రావాలకు దారి తీస్తున్నాయి. మరోవైపు సురక్షిత గర్భస్రావం (abortions) కోసం వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడం కూడా గణాంకాల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    